epaper
Sunday, March 1, 2026
epaper

గాంధీ పేరే బీజేపీకి భయం!

గాంధీ పేరే బీజేపీకి భయం!
ఉపాధి హామీ నుంచి పేరు తొలగింపు అప్రజాస్వామికం
లౌకిక దేశంలో మోదీ–అమిత్ షాల పప్పులు ఉడకవు
రాజ్యాంగంపై కుట్రలు జ‌రుగుతున్నాయి..
కేంద్రంలో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి
టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్‌
అధికారం ఉందని దుర్మార్గ నిర్ణయాలు : జూపల్లి కృష్ణారావు

కాకతీయ, హైదరాబాద్ : మహాత్మా గాంధీ పేరు పలికితే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఉలుకే పరిస్థితి ఏర్పడుతుందని టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్‌ ధ్వజమెత్తారు. ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ ఆధ్వర్యంలో శనివారం ఎంజీ రోడ్డులో నిర్వహించిన నిర‌స‌న‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గాంధీ కుటుంబం పేరు వింటే బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. గాడ్సేను పూజించే వారు కావడంవల్లే గాంధీ పేరును తొలగించాలనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో చర్చించి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది సోనియా గాంధీయేనని గుర్తు చేశారు. పేదలకు ఏడాదికి 100 రోజుల ఉపాధి కల్పించిన ఈ పథకానికి 2014 తర్వాత బీజేపీ ప్రభుత్వం నిధులు కోత పెడుతూ వస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగించడం అప్రజాస్వామికమని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ పేరు ప్రజల హృదయాల నుంచి ఎవరూ చెరపలేరన్నారు.

రాజ్యాంగంపై కుట్రలు
రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు బీజేపీ తెరలేపిందని, మనుస్మృతి అమలు చేయాలనే పన్నాగం చేస్తోందని ఆరోపించారు. గాంధీ–నెహ్రూ వారసత్వాన్ని మరిపించాలనే ప్రయత్నాలు ఫలించవన్నారు. లౌకిక దేశంలో మోదీ, అమిత్ షాల పప్పులు ఉడకవని స్పష్టం చేశారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేసే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు కర్రకాల్చి వాత పెట్టారని వ్యాఖ్యానించారు.

అధికారం ఉందని దుర్మార్గపు నిర్ణయాలు : జూపల్లి కృష్ణారావు

అధికారం ఉందన్న అహంకారంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకుంటోందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ప్రతి భారతీయుని గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు. కరువు కాటకాలు, ఆర్థిక కష్టాల సమయంలో అట్టడుగు పేదలకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కోట్లాది పేద కుటుంబాలకు ఉపాధి, గౌరవాన్ని కల్పించిన ఈ గొప్ప పథకాన్ని నేడు బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఉన్న రాజకీయ కక్షతోనే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి విరుద్ధమని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఈ చట్టాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు గ్రామాలు, ప్రజలు ఏకం కావాలని జూపల్లి పిలుపునిచ్చారు. అందరూ ఒక్కతాటిపైకి వచ్చి ఈ అన్యాయ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌, ఎమ్మెల్యే వెడమ బొజ్జు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుడీఎస్పీ రవీందర్...

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల...

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు – కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు

45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు… కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు కాక‌తీయ‌, తెలంగాణ...

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్...

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత – నిమ్స్‌లో చికిత్స

బిగ్ బ్రేకింగ్‌..! మాజీ మంత్రి జీవన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత ఇటీవల రాజకీయ పరిణామాలతో...

ఖమ్మం నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం – విద్యార్థిపై దాడి

నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం మత్తులో ఇద్దరు విద్యార్థుల దాడి… ఇంటర్ విద్యార్థి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img