విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని
* ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి
* సైన్స్ తోనే దేశం అభివృద్ధి
కాకతీయ,చేర్యాల:మండలంలోని అర్జున్ పట్ల గ్రామ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. సైన్స్ పిల్లలలో అంతర్గతంగా దాగివున్న నైపుణ్యాలను, సృజనత్మాకతను పెంపొందిస్థాయని తద్వారా వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందని పేర్కొన్నారు.పిల్లల్లో ఉన్న మానసిక ఆలోచనలను వెలుగులోకి తీసుకురావడానికి సైన్స్ ఫెయిర్ ఉపయోగపడుతుందని వారు తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న విజ్ఞానాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో మేలు చేస్తాయని స్పష్టం చేశారు. సైన్స్‌తోనే దేశం అభివృద్ధి జరుగుతుందని, కరోనా వంటి కష్ట కాలంలోనూ మన శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేసి ఎన్నో దేశాల ప్రజలను కాపాడారని గుర్తుచేశారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు సెన్స్ ఫేర్ దోహదపడుతుందన్నారు. విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు.పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తాము రూపొందించిన ప్రాజెక్ట్లను ప్రదర్శించి వాటి ప్రాధాన్యతను వివరించారు.అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.కాగా ప్రధమ బహుమతి భవిష్య అనే విద్యార్థినికి నగదు బహుమతి అందచేసారు.ఈ సైన్స్ దినోత్సవంలో ఉపాధ్యాయులు,కులకర్ణి,కవి రచయిత మంగళగిరి రాజా మూర్తి,సరిత,మల్లికార్జున్, షాదుల్ల, విద్యార్థులు పాల్గొన్నారు.


