బీజేపీ విధానాలతో చిరు వ్యాపారులకు దెబ్బ
వైశ్య వర్గానికి కాంగ్రెస్ అండ : రాహుల్ గాంధీ
కాకతీయ, నేషనల్ డెస్క్ : బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్ల దేశంలోని చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ముఖ్యంగా చిన్న వ్యాపారాలపై ఆధారపడి జీవించే వైశ్య వర్గం ఎక్కువగా ప్రభావితమవుతోందని పేర్కొన్నారు. ఆ వర్గానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు చిరు వ్యాపారాలపై భారంగా మారాయని, కార్పొరేట్లకే లాభం చేకూరే విధానాలను భాజపా ప్రభుత్వం అనుసరిస్తోందని ఆరోపించారు. బీజేపీ మనస్తత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చిన్న వ్యాపారాలకు ఊరట కలిగించే విధానాలు అమలు చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.


