కాకతీయ, ఫీచర్ డెస్క్ : ప్రస్తుతం ఆరట్టైలో వాయిస్ మరియు వీడియో కాల్‌లకు మాత్రమే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంది. అయితే, త్వరలోనే టెక్స్ట్ సందేశాలకు కూడా ఈ ఫీచర్‌ను తీసుకురానున్నారు. ఇది ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఇటీవల కాలంలో, ముఖ్యంగా అక్టోబర్‌లో ఆరట్టై డౌన్‌లోడ్‌లు గణనీయంగా పెరిగాయి. కేంద్ర మంత్రులు మరియు పారిశ్రామికవేత్తలు వంటి ప్రముఖ వ్యక్తులు ఈ యాప్‌కు మద్దతు తెలపడం దీనికి ఒక కారణంగాద టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల విడుదల చేసిన అప్‌డేట్‌లలో ఛానెల్‌ల కోసం ఫిల్టర్, మెరుగైన మెసేజ్ ఇన్‌పుట్ బాక్స్, ట్యాబ్‌ల మధ్య సులభంగా మారడానికి స్వైప్ చేసే ఫీచర్ మరియు ఒడియా భాషకు మద్దతు వంటివి ఉన్నాయి.
వాట్సాప్ ఖాతా పునరుద్ధరణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా, సుప్రీంకోర్టు “వాట్సాప్ లేకపోతేనేం, ఆరట్టై వాడొచ్చు కదా” అని వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ యాప్‌కు పాపులారిటీ ఏర్పడింది. అనేక మంది ఆరట్టై గురించి సెర్చ్ చేయడం.. డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించడం మొదలు పెట్టారు. ప్రస్తుతం అత్యధికంగా డౌన్ లోడ్ యాప్‌గా దూసుకెళ్తోంది. ఈ యాప్ “పాకెట్” అనే ప్రత్యేకమైన క్లౌడ్ స్టోరేజ్ ఫీచర్‌ను అందిస్తోంది. దీని ద్వారా వినియోగదారులు సందేశాలు, మీడియా మరియు నోట్స్‌ను సులభంగా సేవ్ చేసుకోవచ్చు. ఆరట్టై వినియోగదారుల గోప్యతకు ప్రాధాన్యత ఇస్తోంది. మరియు వినియోగదారుల డేటాను మూడవ పక్షాలతో పంచుకోమని హామీ ఇస్తోంది.


