epaper
Sunday, March 1, 2026
epaper

రూ.30 వేలు తగ్గిన వెండి

రూ.30 వేలు తగ్గిన వెండి

ఒక్క రోజులోనే దిగొచ్చిన ధ‌ర‌

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,59,680

కిలో వెండి ధర రూ.2,69,000

అంతర్జాతీయ మార్కెట్​లోనూ త‌గ్గుద‌ల‌

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశీయ మార్కెట్​లో ధరలు గురువారం కాస్త దిగొచ్చాయి. ముఖ్యంగా వెండి బుధవారంతో పోలిస్తే దాదాపు రూ.30 వేల మేర తగ్గింది. కిలో వెండి ధర రూ.2,69,000గా ఉంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.6,600 తగ్గి రూ.1,59,680కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ.1,41,550గా ఉంది. అంతర్జాతీయంగానూ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఔన్సు బంగారం ధర 4919 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 79 డాలర్లుగా కొనసాగుతోంది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో డెలివరీ కాంట్రాక్టుకు వెండి దాదాపు 7 శాతం పడిపోయింది. కిలో ధర రూ.2.49 లక్షల వద్ద ఉంది. ఏప్రిల్‌ డెలివరీలకు పసిడి ధర స్వల్పంగా పెరిగి 10 గ్రాముల ధర రూ.1.53 లక్షలకు చేరింది. బుధవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇటీవల యూఎస్‌ ఫెడ్‌కు కొత్త ఛైర్మన్‌ నియామకం, సీఎంఈ మార్జిన్‌ను పెంచడం, గరిష్ఠాల వద్ద భారీ ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణంగా ఈ రెండు లోహాల ధరలు భారీగా పెరిగాయి. దీన్ని అవకాశంగా తీసుకుని మదుపర్లు దీర్ఘకాలిక వ్యూహంతో కొనుగోళ్లకు దిగడం వల్ల వీటికి మళ్లీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో అంతర్జాతీయ స్పాట్‌ మార్కెట్‌లో బంగారం ఔన్సు 4,887 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, వెండి 85.98 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ధరల్లో హెచ్చుతగ్గులు

అయితే వెండి ధరల్లోని ఈ హెచ్చుతగ్గులపై ‘ఆల్ ఇండియా జ్వెల్లర్స్ అండ్ గౌర్మెట్ ఫెడరేషన్’ జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా ఇటీవల స్పందించారు. గత 15 రోజుల్లోనే వెండి ధర రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు పెరిగిందని అన్నారు. ఇంత వేగంగా, ఒకే దిశలో పెరగడం ఎప్పుడూ నిలకడగా ఉండదని తెలిపారు. అందుకే ఇప్పుడు ఈ హెచ్చుతగ్గులు అని చెప్పారు. అమెరికా వెండిని ‘క్రిటికల్ మినరల్’గా గుర్తించడం, చైనా ఎగుమతులను నియంత్రించడంతో డిమాండ్ పెరిగిందని అన్నారు. అయితే ఎక్స్చేంజీలలో జరిగే ‘పేపర్ ట్రేడ్’ వల్ల ధరల్లో ఇంత అస్థిరత వస్తోందని అన్నారు. బంగారం, వెండి ధరలు రోజుల నుంచి నిమిషాల వ్యవధిలో మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆభరణాల విక్రయదారులు ధరలను మార్చివేస్తున్నారు. ఆన్​లైన్​లో ధరలు ప్రకారమే నగదును వసూలు చేస్తున్నారు. కానీ ధరలు తగ్గినపుడు కొంతమంది వ్యాపారులు తగ్గింపును చూపడం లేదని కొనుగోలుదారులు అంటున్నారు. పెరిగిన ధరలనే చూపిస్తున్నారంటూ చెబుతున్నారు. నగలు కొనడానకి వెళ్లినప్పుడు ధరలను ఎప్పటికప్పుడు చెక్​ చేసుకోవడం మంచింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బ్యాంక్ కస్టమర్లకు ఊరట?

బ్యాంక్ కస్టమర్లకు ఊరట? అన్ని బ్యాంకులకు ఒకే ఛార్జీలు, నిబంధనలు! ఆర్బీఐ కసరత్తు షురూ కాక‌తీయ‌,...

శాంసంగ్‌ నుంచి గెలాక్సీ A07 5G

శాంసంగ్‌ నుంచి గెలాక్సీ A07 5G త్వరలో విడుదలకు స‌న్నాహాలు కాక‌తీయ‌, బిజినెస్ :...

తీవ్ర సంక్షోభం… ఫ్లైట్ల రద్దుతో కుప్పకూలిన ఇండిగో షేర్లు..!

తీవ్ర సంక్షోభం… ఫ్లైట్ల రద్దుతో కుప్పకూలిన ఇండిగో షేర్లు..! సిబ్బంది కొరత వేళ...

హెచ్‌పీలో భారీగా లేఆఫ్స్.. ఏఐ ఎఫెక్టేనా..?

హెచ్‌పీలో భారీగా లేఆఫ్స్.. ఏఐ ఎఫెక్టేనా..? హెచ్‌పీ లేఆఫ్స్‌ కలకలం ఏఐ ధాటికి 6...

న్యూ అవతార్‌లో టాటా సియ‌ర్రా..

న్యూ అవతార్‌లో టాటా సియ‌ర్రా.. ధ‌ర‌, ఫీచ‌ర్ల వివ‌రాలు ఇవే! ఆటోమొబైల్ ఫ్యాన్స్‌కు గుడ్...

ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్..ఈ నెల 30తో ఆ సేవ‌లు బంద్‌!

ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్..ఈ నెల 30తో ఆ సేవ‌లు బంద్‌! స్టేట్ బ్యాంక్...

ChatGPT ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో..!

ChatGPT ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో..! ఓపెన్ ఏఐ-ఫోన్‌పే వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటింపు కన్స్యూమర్ మరియు...

టాటా ట్రస్ట్స్‌లో విభేదాల మళ్లీ వెలుగులోకి..!

టాటా ట్రస్ట్స్‌లో విభేదాల మళ్లీ వెలుగులోకి..! రతన్ టాటా తర్వాత వారసత్వ పోరు నోయెల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img