epaper
Friday, April 17, 2026
epaper

పెళ్లి రోజునే షేక్ హసీనాకు మరణశిక్ష..

పెళ్లి రోజునే షేక్ హసీనాకు మరణశిక్ష..
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత!
నవంబర్ 17 హసీనా జీవితాన్ని మార్చిన రోజు
పెళ్లి రోజునే మరణశిక్ష
ఐసీటీ తీర్పునకు వ్యతిరేకంగా నిర‌స‌నలు చేప‌ట్టిన హ‌సీనా వ‌ర్గం

కాక‌తీయ‌, జాతీయం : బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) విధించిన మరణశిక్ష దేశం మొత్తాన్ని కుదిపేస్తుంది. బంగ్లాదేశ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా చోటుచేసుకున్న హింసాత్మక నిరసనలు, దాడులు, రాజకీయ అల్లర్లలో హసీనాకి సంబంధం ఉందని ట్రైబ్యునల్ తేల్చింది. విచారణలో కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించడంతో, ఐసీటీ నేరుగా మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును హసీనా వర్గం పూర్తిగా రాజకీయ ప్రేరేపిత నిర్ణయంగానే అభివర్ణిస్తోంది.

ఈ తీర్పు వెలువడిన నవంబర్ 17 తేదీ హసీనాకు ప్రత్యేకమైనది. నవంబర్ 17 హ‌సీనా పెళ్లి రోజు. 1967లో అదే రోజున ఆమె తన భర్త డా. ఎం.ఎ. వాజేద్ మియాతో వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో, ఆమె పెళ్లి సన్నిహితుల సమక్షంలోనే అత్యంత రహస్యంగా జరిగింది. పెళ్లి పూర్తయ్యాక ఆమె తన తండ్రి ఆశీర్వాదం కోసం నేరుగా జైలుకే వెళ్లింది. ఆ రోజు జీవితాంతం చిరస్మరణీయంగా నిలిచిపోయినప్పటికీ… ఇన్నేళ్ల తరువాత అదే తేదీన మరణశిక్ష విధించబడటం విధి వింతగా మారింది.

ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్‌లో విచారణ వేగంగా సాగ‌గా.. కోర్టు హసీనాపై ఉన్న అన్ని ఆరోపణలను ధృవీకరించింది. ఆమెపై నమోదైన కేసులు గతంలో జరిగిన అల్లర్లు, ప్రాణ నష్టం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి అంశాలకు సంబంధించినవే. ఈ నేపథ్యంలో హసీనాకు మరణశిక్ష విధించడం దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘటనగా నిలిచింది. తీర్పు వెలువడిన వెంటనే హసీనా మద్దతుదారులు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చారు. రాజ‌ధాని ఢాకా సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఐసీటీ తీర్పునకు వ్యతిరేకంగా నిర‌స‌నలు చేప‌ట్టారు. దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తూ రెండు రోజులపాటు బంద్‌ ప్రకటించింది అవామీ లీగ్‌. దాంతో దేశంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కాగా, ఈ తీర్పు వెనుక రాజకీయ కోణం ఉన్నట్టుగా అనేక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హసీనా ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్య జరిగిందని కొందరు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, హసీనావర్గం ఈ మరణశిక్షపై ఉన్నత న్యాయస్థానం ముందు అప్పీల్‌కి సిద్ధమవుతోంది. ఈ ప‌రిణామాల న‌డుమ మరణశిక్ష అమలవుతుందా? లేక రాజకీయ మలుపులు ఈ కథను మరో దిశగా తీసుకెళ్తాయా? అన్నది చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మోదీ, విజయన్‌కు తేడా ఏంలేదు

మోదీ, విజయన్‌కు తేడా ఏంలేదు బీజేపీ తమ ఓటు బ్యాంకును మార్పిడి అయ్యేలా...

మోదీ ఖాతాలో మ‌రో రికార్డు

మోదీ ఖాతాలో మ‌రో రికార్డు భారత రాజకీయాల్లో నూతన మైలురాయి! ప్రభుత్వ అధినేతగా అత్య‌ధిక...

గ్రీన్ లాండ్‌ను మేం ర‌క్షిస్తాం

గ్రీన్ లాండ్‌ను మేం ర‌క్షిస్తాం ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కౌంటర్ కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్...

ఎల్పీజీ సంక్షోభానికి ఊరట

ఎల్పీజీ సంక్షోభానికి ఊరట మంగళూరు పోర్టుకు చేరిన‌ గ్యాస్ ట్యాంకర్లు వచ్చే వారం భారీ...

పంజాబ్‌లో మాజీ మంత్రిపై కేసు

పంజాబ్‌లోమాజీ మంత్రిపై కేసు గగన్‌దీప్ సింగ్ రంధావా ఆత్మహత్య కేసులో మ‌లుపు వేధింపుల ఆరోపణలపై...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ప్రియుడితో పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా..!

ప్రియుడితో పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా..! స్టేష‌న్‌కు చేరుకున్న కుంభ‌మేళా బ్యూటీ ల‌వ్ మ్యాట‌ర్‌ తండ్రి...

108మంది మావోయిస్టుల లొంగుబాటు

108మంది మావోయిస్టుల లొంగుబాటు స‌రెండ‌ర‌యిన వారిలో 44 మంది మహిళా మావోయిస్టులు 101 అత్యాధునిక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img