epaper
Sunday, March 1, 2026
epaper

ముగిసిన సెక్యూరిటీ ట్రాఫిక్ కంట్రోల్ శిక్షణ తరగతులు

ముగిసిన సెక్యూరిటీ ట్రాఫిక్ కంట్రోల్ శిక్షణ తరగతులు

కాకతీయ, కొత్తగూడెం: సింగరేణి వ్యాప్తంగా పిసి అండ్ పిసిసెక్యూరిటీ గార్డులకు విడతల వారీగా నిర్వహించే ట్రాఫిక్ కంట్రోల్ శిక్షణా తరగతులలో భాగంగా నాలుగు రోజుల పాటు కొత్తగూడెం ట్రైనింగ్ సెంటర్ నందు నిర్వహించిన 54వ ట్రాఫిక్ కంట్రోల్ శిక్షణా తరగతులు శుక్రవారంతో ముగిసాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏరియా సెక్యూరిటీ అధికారి ట్రైనింగ్ అధికారి యం.డి. జాకీర్ హుస్సేన్ పాల్గొని మాట్లాడారు. సెక్యూరిటీ సిబ్బంది అందరికీ క్రమశిక్షణ అనేది ముఖ్యమని పేర్కొన్నారు. మనం క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్నపుడే గుర్తింపు వస్తుందని, ట్రాఫిక్ కంట్రోల్ శిక్షణ సెక్యూరిటీ సిబ్బంది అందరికీ అవసరమన్నారు. ఈ శిక్షణ వలన డ్యూటీ జీవితంలోనే కాకుండా, వ్యక్తిగతంగా కూడా ఉపయోగకరమైనదని చెప్పారు. ఈ నాలుగు రోజుల శిక్షణా కాలంలో ట్రాఫిక్ రెగ్యులేటరీ చట్టం, మాండేటరీ, కాషనరీ, ఇన్ఫర్మేటరీ సిగ్నల్స్, ట్రాఫిక్ పాయింట్ మన్ డ్యూటీస్, క్రౌడ్ కంట్రోల్ వంటి అంశాలపై అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీచే పూర్తి అవగాహన కలిగించడం జరిగిందని తెలిపారు. ఈ శిక్షణ వలన ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా మెయిన్ గేటు వద్ద, చెక్ పోస్ట్ ల వద్ద రద్దీ లేకుండా సాఫీగా అందరు తమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు దోహదం చేస్తుందని, ఎస్ అండ్ పిసి విభాగం పటిష్టంగా ఉండేందుకు కావలసిన అన్ని రకాల చర్యలు ట్రైనింగ్ సెంటర్ అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలు యాజమాన్యం అందిస్తుందని వివరించారు. సెక్యూరిటీ సిబ్బంది అందరు మెరుగైన వృత్తి నైపుణ్యంతో అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ సింగరేణి ఆస్తులు స్థలాలను పరిరక్షించాలని సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని తెలిపారు. అనంతరం ఉత్తమ ట్రైనీలుగా ఎంపిక అయిన శ్రీనివాసరావు, శ్రీనివాస్ కు బహుమతి ప్రధానం చేశారు. శ్రీ జ్యోతి అనాథ వృద్ధుల శరణాలయ నిర్వాహకులకు నిత్యవసరాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఇన్ స్పెక్టర్ డి.నారాయణరెడ్డి, ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

పంచాయతీ కార్మికులకు భరోసా.. 15 లక్షల ప్రమాద బీమా

పంచాయతీ కార్మికులకు భరోసా.. 15 లక్షల ప్రమాద బీమా కాకతీయ, చింతకాని :...

“మా జీవితాలు బుగ్గి కావాలా..?” ఆనందాపురంలో గిరిజనుల ఆవేదన

“మా జీవితాలు బుగ్గి కావాలా..?” ఆనందాపురంలో గిరిజనుల ఆవేదన అగ్రకుల ఆధిపత్యంపై సర్పంచ్...

ఇసుక మాఫియాపై ఉక్కుపాదం

ఇసుక మాఫియాపై ఉక్కుపాదం సరిహద్దుల్లో విజిబుల్ పోలీసింగ్ పటిష్టం చేయాలి అక్రమ రవాణాపై కేసులు,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img