నిర్మల హై స్కూల్ లో ఘనంగా సైన్స్ ఫెయిర్
ఆకట్టుకున్న పిల్లల ప్రాజెక్టు వర్కక్స్
కాకతీయ,కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకట్య తండా గ్రామంలోని నిర్మల హైస్కూల్లో నిర్వహించిన జాతీయ సైన్స్ ఫెయిర్ శనివారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల లోని విద్యార్థిని,విద్యార్థులు, పలు రకాల ప్రాజెక్టు వర్క్స ను సొంతంగా తయారు చేసిన ప్రదర్శనలో వాటి పనితీరును తోటి విద్యార్థులు, తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ పేనిల మాట్లాడుతూ పిల్లల మనో వికాసానికి సైన్స్ ఫెయిర్లు ఎంతగానో దోహదం చేస్తాయని తెలిపారు.
సరిగా ఇదే రోజున ఫిబ్రవరి 28.1928న ప్రాఖ్యత భారత భౌతిక శాస్త్ర నిపుణుడు సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న సందర్భంగా భారత ప్రభుత్వం ప్రతి ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డే గా జరుపుకుంటారు. అని తెలిపారు. విద్యార్థులంతా సివి రామన్ ఆదర్శంగా తీసుకొని నూతన సైన్స్ రంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. సైన్స్ ఫెయిర్ లో భాగంగా విద్యార్థులు చంద్రాయన్ 3 నర్స్వ సిస్టం, రెస్పిరేటరీ సిస్టం, విండ్ మిల్ వాటర్ ప్యూరిఫికేషన్, డయాలసిస్ హార్ట్ వర్కిమ్స్ సిస్టం, రోబోటిక్ సిస్టమ్ లాంటి వర్క్స్ చేసి వాటి పనితీరును వివరిస్తూ అందరిచేత ప్రశంసలు పొందుతారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చేసిన సింగరేణి మండల ఏంఈఓ దుగ్గిరాల జయరాజు, కారేపల్లి సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ (టోనీ ), ప్రవీణ్ పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


