- సహకరించిన వారిపై సైతం కేసులు తప్పవు
కాకతీయ, పినపాక: ప్రభుత్వ నిషేధిత గంజాయిని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారిని జైలుకు పంపించడమే కాకుండా వారి బంధువుల ఆస్తులను కూడా జప్తు చేస్తామని ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడారు. ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్లో నమోదైన గంజాయి రవాణా కేసులో ముద్దాయిల తోపాటు బంధువుల ఆస్తులను ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వారి పేరు మీద ఉన్న ఆస్తులను కూడా ఫ్రీజింగ్ చేయడం జరిగిందని తెలిపారు. వారి బంధువుల ట్రాక్టర్,కారు, ఆటో, నాలుగు మోటార్ సైకిల్ల , మూడు గృహాలను గుర్తించి చెన్నై కాంపిటెంట్ అథారిటీ వారికి పంపగా వాటిలో నుంచి ఒక ట్రాక్టర్, కారు, ఆటో, నాలుగు మోటార్ సైకిల్లకు సంబంధించి ఫ్రీజింగ్ ఆర్డర్ తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కేసులో ముద్దాయిలైన నలుగురికి సంబంధించిన ఆస్తులను, వారి బంధువుల ఆస్తులను ఫ్రీజింగ్ చేయడం జరిగిందని తెలిపారు.


