సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ
కాకతీయ, ఖమ్మం : ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా నిర్వహించనున్న సన్మానసభ పోస్టర్‌ను ఖమ్మం జడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలోని మాదిగ ఉద్యోగుల ఆధ్వర్యంలో మార్చి 6న హైదరాబాద్ శిల్పకళా వేదికలో సన్మానసభ నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని ఉద్యోగులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు ఎస్సీ వర్గీకరణ చట్ట అమలు సామాజిక న్యాయ దిశగా కీలక అడుగని పేర్కొన్నారు. వర్గీకరణ కోసం దశాబ్దాలుగా సాగిన పోరాటానికి ఇది ఫలితమని తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ చిర్ర బాబురావు, కిరణ్ చక్రవర్తి, వి చిన్నబాబురావు, చేకూరి రమేష్, సగ్గుర్తి రామారావు, పొనుగోటి రవి, పేరెల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.


