epaper
Friday, April 17, 2026
epaper

ఢిల్లీ బ్లాస్ట్‌ కుట్రలో కొత్త మలుపు..

ఢిల్లీ బ్లాస్ట్‌ కుట్రలో కొత్త మలుపు..జనవరి 26న మరో దాడికి ప్లాన్..!
దీపావళికే దాడి చేయాలని ప్లాన్ చేసిన నిందితులు
ముజామ్మిల్ మొబైల్ డేటాలో బయటపడ్డ రహస్యాలు
జనవరి 26న మరో దాడి ప్రణాళిక

కాక‌తీయ‌, జాతీయం : దేశ రాజధానిని కుదిపేసిన ఎర్రకోట పేలుడు ఘటన ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. సోమ‌వారం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత భద్రతా వ్యవస్థ అంతటా అలర్ట్ మోగింది. మొదట ఈ ఘటనను యాదృచ్ఛిక ప్రమాదమని భావించిన పోలీసులు, ఇప్పుడు దీన్ని ఒక పూర్తిస్థాయి ఉగ్రదాడి కుట్రగా గుర్తించారు. ద‌ర్యాప్తులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ప్ర‌ధాన నిందితుడు ముజామ్మిల్, విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. అతను అధికారులకు తెలిపిన వివరాల ప్రకారం, అతని టీమ్‌ మొదట దీపావళి సందర్భంగా ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాల్లో దాడి చేయాలని నిర్ణయించిందట. రద్దీ గల షాపింగ్ ఏరియాలు, మార్కెట్లు, మరియు మెట్రో స్టేషన్లు వారి టార్గెట్ లిస్ట్‌లో ఉన్నాయని సమాచారం. అయితే చివరి నిమిషంలో దానిని అమలు చేయడంలో విఫలమైనట్టు పేర్కొన్నాడు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ముజామ్మిల్, ఫరిదాబాద్‌లోని ఆల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో వైద్యుడిగా పనిచేశాడు. అదే యూనివర్సిటీలో అతనితో కలిసి పనిచేసిన ఉమర్, దాడి ప్రణాళికలో భాగమని అధికారులు చెబుతున్నారు. ఉమర్ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారులో బాంబు పేలడంతో మృతిచెందాడు. ముజామ్మిల్ చెప్పిన వివరాల ప్రకారం, ఉమర్‌తో కలిసి అతడు దాడి ప్రదేశాన్ని ముందే స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

తదుపరి టార్గెట్ జనవరి 26..

దీపావళి ప్లాన్ విఫలమైన తర్వాత, నిందితులు వచ్చే ఏడాది జనవరి 26 (రిపబ్లిక్ డే) న మరో పెద్ద దాడి జరపాలని నిర్ణయించుకున్నారని విచారణలో తేలింది. ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాలను టార్గెట్‌గా ఎంచుకున్నట్టు ముజామ్మిల్ తెలిపాడు. జనవరి 26న రాజధానిలో అధిక భద్రతా వాతావరణం ఉండటం వల్ల ఈ దాడి ప్లాన్ సాధ్యమా కాదా అన్నది వారి మధ్య చర్చించుకున్నారని విచారణలో వెల్లడైంది. ముజామ్మిల్ మొబైల్ ఫోన్, సోషల్ మీడియా అకౌంట్లు, కాల్ రికార్డులు పరిశీలించగా అనేక సందేహాస్పద చాట్‌లు, లొకేషన్ హిస్టరీలు బయటపడ్డాయి. అతను మరియు ఉమర్ కలసి ఎర్రకోట పరిసరాల్లో పలు సార్లు రిక్కీ చేసినట్లు GPS డేటా ద్వారా నిర్ధారణ అయ్యింది. ఈ సమాచారంతో మరికొందరు వ్యక్తులు కూడా ఈ దాడి ప్రణాళికలో భాగమై ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ముజామ్మిల్ ప్ర‌స్తుతం కస్టడీలోనే ఉన్నాడు. అతడి ద్వారా సేకరించిన ఆధారాలతో పాటు, ఉమర్ మరణానికి ముందు ఉన్న కాల్ లాగ్‌లు, వాహన రికార్డులు, మరియు ఫైనాన్షియల్ లావాదేవీలను పోలీసులు విచారిస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీ బ్లాస్ట్ ఘ‌న‌ట అనంత‌రం అధికార‌లు ఎర్రకోట పరిసరాల్లో, మెట్రో స్టేషన్ల వద్ద, ముఖ్యంగా రిపబ్లిక్ డే సన్నాహాల నిమిత్తం మ‌రింత కఠిన భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మోదీ, విజయన్‌కు తేడా ఏంలేదు

మోదీ, విజయన్‌కు తేడా ఏంలేదు బీజేపీ తమ ఓటు బ్యాంకును మార్పిడి అయ్యేలా...

మోదీ ఖాతాలో మ‌రో రికార్డు

మోదీ ఖాతాలో మ‌రో రికార్డు భారత రాజకీయాల్లో నూతన మైలురాయి! ప్రభుత్వ అధినేతగా అత్య‌ధిక...

గ్రీన్ లాండ్‌ను మేం ర‌క్షిస్తాం

గ్రీన్ లాండ్‌ను మేం ర‌క్షిస్తాం ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కౌంటర్ కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్...

ఎల్పీజీ సంక్షోభానికి ఊరట

ఎల్పీజీ సంక్షోభానికి ఊరట మంగళూరు పోర్టుకు చేరిన‌ గ్యాస్ ట్యాంకర్లు వచ్చే వారం భారీ...

పంజాబ్‌లో మాజీ మంత్రిపై కేసు

పంజాబ్‌లోమాజీ మంత్రిపై కేసు గగన్‌దీప్ సింగ్ రంధావా ఆత్మహత్య కేసులో మ‌లుపు వేధింపుల ఆరోపణలపై...

డ్రగ్స్ కేసులో మ‌నీ లింకులు

డ్రగ్స్ కేసులో మ‌నీ లింకులు ఆర్థిక లావాదేవీలపై సిట్‌ ఫోకస్ బ్యాంకు ఖాతాల విశ్లేషణతో...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ప్రియుడితో పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా..!

ప్రియుడితో పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా..! స్టేష‌న్‌కు చేరుకున్న కుంభ‌మేళా బ్యూటీ ల‌వ్ మ్యాట‌ర్‌ తండ్రి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img