epaper
Saturday, November 15, 2025
epaper

యువతకు ఉద్యోగాల గేట్ వేగా ‘నైపుణ్యం’ పోర్టల్

యువతకు ఉద్యోగాల గేట్ వేగా ‘నైపుణ్యం’ పోర్టల్

ప్రతీ నెలా, ప్రతీ నియోజకవర్గంలో జాబ్ మేళాలు

నైపుణ్యాభివృద్ధితో పాటు ఉన్నత విద్యకు సహకారం

శిక్షణ పూర్తయితే స్కిల్ టెస్టింగ్, ధృవపత్రాల జారీ

ఆర్టీఐహెచ్‌తో విద్యార్ధుల ఆవిష్కరణల అనుసంధానం

నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

కాక‌తీయ‌, అమరావతి బ్యూరో : యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే, వారి ఉన్నత విద్యకు సహకరించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూసే వారి కోసం రూపొందించిన ‘నైపుణ్యం’ పోర్టల్ ఉద్యోగాల గేట్ వేగా ఉండాలని అధికారులకు సూచించారు. 2029 కల్లా 20 లక్షలు ఉద్యోగాలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసేలా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇకపై ప్రతీ నెలా, ప్రతీ నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. నవంబర్‌లో జరిగే భాగస్వామ్య సదస్సులోగా ‘నైపుణ్యం’ పోర్టల్ ప్రారంభించి, అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన వారికి ఇక నుంచి అధికారికంగా ధ్రువపత్రాలు జారీ చేయాలన్నారు. గురువారం సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్‌తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. నైపుణ్యం పోర్టల్, జాబ్ డ్యాష్ బోర్డ్, వివిధ కోర్సులు, ఉద్యోగావకాశాలు తదితర అంశాల గురించి సమీక్షలో చర్చించారు.

క్లస్టర్ల ఆధారంగా నైపుణ్య శిక్షణ : లోకేష్

క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ద్వారా నైపుణ్యాలను పెంచేలా ప్రయత్నిస్తున్నామని… స్పేస్, ఆక్వా, క్వాంటం లాంటి రంగాల్లో సంస్థలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించేలా కార్యాచరణ చేపట్టినట్టు మంత్రి లోకేష్ ముఖ్యమంత్రికి తెలిపారు. మొత్తం 15 క్లస్టర్ల ద్వారా పరిశ్రమలకు మానవ వనరుల్ని అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని సీఎంకు వివరించారు. ఈ విధానంపై ఆస్ట్రేలియాలో అధ్యయనం చేసి అమలు చేస్తున్నామన్నారు. దేశ విదేశాల్లో ఉద్యోగాలు ఎక్కడ లభిస్తున్నాయో అందరికీ తెలిసేలా నైపుణ్య పోర్టల్ అభివృద్ధి చేయడమే కాకుండా… నైపుణ్య కల్పనలో దేశ, విదేశాలకు చెందిన సంస్థలను సంప్రదించాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. విశ్వవిద్యాలయాలు, జాతీయ-అంతర్జాతీయ విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకుంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఏ లబ్ది పొందకుండా నిరుద్యోగులుగా ఉన్నవారికి ప్రయోజనం చేకూర్చేలా నైపుణ్యం పోర్టల్ తీర్చిద్దాలన్నారు. అభ్యర్ధులు ఏ రంగంలో తమకు ఉద్యోగం, ఉపాధి కావాలని కోరుకుంటున్నారో… ఆ అవకాశాన్ని పొందేలే వివరాలు పోర్టల్‌లో పొందుపరచాలని సీఎం సూచించారు.

అన్ని శాఖలు, విభాగాల డేటా అనుసంధానం :

ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 1,44,000 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. నైపుణ్యం పోర్టల్ నుంచి ఏఐ ద్వారా అభ్యర్ధులు తమ రెజ్యూమ్ రూపొందించుకునే వెసులుబాటు కల్పించినట్టు వెల్లడించారు. వాట్సప్ ద్వారా ఉద్యోగావకాశాల గురించి సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అన్ని శాఖలు, విభాగాల డేటా బేస్‌ సమీకృతం చేసి నిజమైన నిరుద్యోగులను గుర్తిస్తున్నామని అధికారులు వివరించారు. ఎక్కడ, ఏ రంగంలో శిక్షణ అందిస్తున్నాం, జాబ్ మేళాలు ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నాం, ఏయే సంస్థల్లో ఎలాంటి ఉద్యోగ ఖాళీలు ఉన్నాయనే దానిపై పోర్టల్ నుంచి అభ్యర్ధులకు సమాచారం అందేలా తీర్చిదిద్దామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఉద్యోగార్దులు ఇంటర్వూలకు సిద్ధమయ్యేలా ఏఐ సిమ్యులేటర్‌ సైతం నైపుణ్యం పోర్టల్‌లో అందుబాటులో ఉందన్నారు.

విదేశీ భాషల్ని నేర్చుకునేలా శిక్షణ

‘పోర్టల్‌లో ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీలు, వివిధ విద్యా సంస్థలతో పరిశ్రమలు, సంస్థలను అనుసంధానించాలి. విద్యా సంస్థలకు ఫ్యూచర్ ట్రెండ్స్ తెలిసేలా చేయాలి. ప్లేస్మెంట్ వివరాలనూ ట్రాకింగ్ చేసేలా ఉండాలి. స్కిల్ టెస్టింగ్‌కు కూడా అవకాశం కల్పించాలి. పాఠశాల స్థాయిలో విద్యార్ధుల నూతన ఆవిష్కరణలను మరింత ఉన్నతీకరించేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో అనుసంధానించాలి. విదేశాల్లో ఉద్యాగావకాశాలు సులభంగా పొందేందుకు వీలుగా ఆయా దేశాల స్థానిక భాషలను నేర్చుకునేలా శిక్షణ అందించాలి. ఏపీ ఎన్‌ఆర్టీ ద్వారా ఉద్యోగ సమాచారం పొందేలా చూడాలి. నైపుణ్యం పోర్టల్ ద్వారా ఏపీలో యువత అందరికీ ఏ రంగంలో నైపుణ్యం కావాలో దానికి సంబంధించిన శిక్షణ… అలాగా ప్రస్తుతమున్న సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకునేలా పున:శిక్షణ, ఉత్తమ శిక్షణ అందించాలి.’ అని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్ ప్రజల‌ నుంచి వినతులు స్వీకరించిన మంత్రి అన్ని విధాల అండగా...

గుంత‌లు లేని దారులే మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం

ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం త్వరలో అందుబాటులోకి ‘జియో...

శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నజరానా

ఇంటి నిర్మాణానికి 1000 చ.గ. స్థలం గ్రూప్ 1 ఉద్యోగం...

జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోనే ఎస్సీ, ఎస్టీల‌కు న్యాయం

కోట మండ‌ల వైసీపీ అధ్య‌క్షులు రాయంకుల‌ కాక‌తీయ. ఏలూరు ప్ర‌తినిధి :...

గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గూడెంకు వెలుగులు కేంద్ర...

కృష్ణా నదిపై హై లెవెల్ వంతెన

దీవుల్లోని గ్రామాలకు అనుసంధానం రాష్ట్ర నిధులతోపాటు, సాస్కీ పథకం నిధులు...

దైవ‌ద‌ర్శ‌నంలో మృత్యుఘోష‌

దైవ‌ద‌ర్శ‌నంలో మృత్యుఘోష‌ శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ ఆలయంలో తొక్కిసలాట 9 మంది భ‌క్తులు మృతి మృతుల్లో...

ఆలయంలో తొక్కిసలాట

9 మంది భ‌క్తులు మృతి మృతుల్లో బాలుడు.. ఎనిమిది మంది...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img