మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు
కాకతీయ, ఖమ్మం:
నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్ జూనియర్ కాలేజ్ నెహ్రు నగర్ బ్రాంచ్ లో శుక్రవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష రాస్తున్న మాల్ ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి ఇన్విజిలేటర్ పట్టుబడ్డాడు.ఈ విషయం
ఎగ్జామినేషన్ చీఫ్ సూపర్డెంట్ బుడిగం స్వాతి దృష్టి కి వెళ్లగా ఆమె స్థానిక 2 టౌన్ లో పిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు అందుకున్న సీఐ బాలకృష్ణ ముగ్గురు వ్యక్తులపై కేసునమోదు చేశారు. సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి భూక్య గణేష్ స్థానంలో కేలోత్ వంశీ చౌహాన్ అనే అతను పరీక్ష రాస్తుండగా, ఇన్విజిలేటర్స్ ఓఎంఆర్ షీట్ మీద ఉన్న సంతకానికి అసలు అభ్యర్థి సంతకానికి తేడా గమనించి అతనిని పట్టుకోవడం జరిగిందన్నారు. పరీక్ష రాయవలసి ఉన్న అభ్యర్థి గణేష్ తండ్రి భద్రు, వంశీ చౌహాన్ కు డబ్బులు ఇస్తానని ఆశ చూపించి ఎగ్జామ్ రాస్తున్నట్లు నిందితుడు ఒప్పుకునట్లు ఆయన తెలిపారు.


