కాకతీయ ఎఫెక్ట్…
నకిలీ సిగరేట్ల విక్రయాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు…
కాకతీయ,రాజన్న సిరిసిల్ల: నకిలీ సిగరేట్ల విక్రయాలపై కాకతీయ దినపత్రికలో ప్రచురించిన “సిరిసిల్లలో నకిలీ సిగరెట్ల దందా” అనే కథనానికి స్పందన లభించింది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక దాడులు ప్రారంభించారు. జిల్లాలోని పలు కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు, పాన్ షాప్‌లలో విస్తృత తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ సీ.ఐ నటేష్ మాట్లాడుతూ…ప్రముఖ బ్రాండ్ల పేర్లతో నకిలీ సిగరేట్లు విక్రయించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.వినియోగదారుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి అక్రమ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు.వ్యాపారులు చట్టాలను కచ్చితంగా పాటించాలని, అనుమానాస్పద ఉత్పత్తులను నిల్వ చేయకూడదని సూచించారు.నకిలీ సిగరేట్ల తయారీ లేదా విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అక్రమ కార్యకలాపాల నిర్మూలనకు ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు.ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తిరుపతి, రాజేష్, శ్రీనివాస్, శివ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.



