- కోట మండల వైసీపీ అధ్యక్షులు రాయంకుల
కాకతీయ. ఏలూరు ప్రతినిధి : మండల వైసీపీ అధ్యక్షులు రాయంకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇటీవల ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా నియమితులైన పడిగి అంజిని గురువారం ఘనంగా సన్మానించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వైసీపీ నాయకులు అందరూ రాయంకుల ఆధ్వర్యంలో అంజిని ఘనంగా సన్మానించారు. ఎస్సీ, ఎస్టీ, బడులు, బలహీన వర్గాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందని రాయంకుల తెలిపారు. కార్యక్రమంలో రాయకుల సత్యనారాయణ, జిల్లా వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ, కామవరపుకోట టౌన్ పార్టీ ప్రెసిడెంట్ నానాది సాగర్ కిరణ్, మెరుగు బాబురావు, శిరిశెట్టి సిద్దిరా, యానాద్రి పీటర్, మానుకొండ దేవరాజు, తమ్మిశెట్టి సుబ్రహ్మణ్యం, బొల్లు సత్యనారాయణ, సుధా, రాజకుమార్, అచ్చయ్య, రోహిత్, ప్రశాంత్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


