epaper
Friday, April 17, 2026
epaper

దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత్‌ సిద్ధం.. తొలి టెస్టుకు కౌంట్‌డౌన్ స్టార్ట్‌!

దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత్‌ సిద్ధం.. తొలి టెస్టుకు కౌంట్‌డౌన్ స్టార్ట్‌!
ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు హడావిడి
దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత్‌ సన్నాహకాలు ప్రారంభం
గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా ప్రాక్టీస్

కాక‌తీయ‌, స్పోర్ట్స్ : భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్‌ ఈ నెల 14న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభం కానుంది. ఇరుజట్లూ ఇప్పటికే కోల్‌కతాకు చేరుకుని సన్నాహకాలను వేగవంతం చేశాయి. ఈ సిరీస్‌ టీమిండియాకు ఎంతో కీలకం, ఎందుకంటే వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ పాయింట్ల పరంగా ఇది నిర్ణయాత్మకంగా మారబోతోంది. తొలి టెస్టుకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అవ్వ‌డంతో మంగళవారం టీమిండియా ఆటగాళ్లు ఈడెన్ గార్డెన్స్‌లో నెట్స్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించారు.

ఈ సెషన్‌లో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్ తో పాటు జైస్వాల్‌, సాయి సుదర్శన్‌, బుమ్రా, జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, నితీశ్‌ రెడ్డి పాల్గొన్నారు. ప్రాక్టీస్‌కు ముందు కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, బౌలింగ్‌ కోచ్‌ మోర్కెల్‌, బ్యాటింగ్‌ కోచ్‌ కోటక్‌ పిచ్‌ను పరిశీలించారు. ఇటీవల పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఫామ్‌ కోల్పోయిన కెప్టెన్‌ గిల్‌ ఈసారి ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. సుమారు గంటన్నరపాటు మైదానంలో చెమటోడ్చి, తన ఫుట్‌వర్క్‌, షాట్‌ సెలెక్షన్‌ పైన దృష్టి పెట్టాడు. గిల్‌ ప్రాక్టీస్‌ సెషన్‌ మొత్తం గంభీర్‌ వ్యక్తిగతంగా గమనించటం కూడా హైలైట్‌గా నిలిచింది.

సెంటర్‌ వికెట్‌పై సాయి సుదర్శన్‌ ఎక్కువగా లెగ్‌సైడ్‌ షాట్లపై దృష్టి పెట్టాడు. దీని ఆధారంగా అతడిని వన్‌డౌన్‌ స్థానంలో ఆడించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో రెండు అన్ అఫీషియల్ టెస్టుల్లో 84 ప‌రుగులు తీసిన నేప‌థ్యంలో మూడో నెంబ‌ర్ బ్యాట‌ర్ గా టీమ్ మేనేజ్‌మెంట్ స‌పోర్ట్‌ సుద‌ర్శ‌న్ కు కొన‌సాగుతోంది. మరోవైపు జైస్వాల్‌ స్పిన్నర్లు జడేజా, సుందర్‌ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ప్రాక్టీస్‌ చేశాడు. పేసర్‌ బుమ్రా ప్రాక్టీస్‌లో కేవలం అర్ధగంట మాత్రమే పాల్గొన్నాడు. వార్మప్‌ తర్వాత కొద్దిసేపు బౌలింగ్‌ చేసి డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిపోయాడు. ఈ సమయంలో అతడి కుడి మోకాలికి పట్టీ కనిపించ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం.

ఇంకోవైపు దక్షిణాఫ్రికా జట్టు సన్నాహకాలు కూడా జోరందుకున్నాయి. పాక్‌తో టెస్టు సిరీస్‌ను 1-1తో ముగించిన సౌతాఫ్రికా జట్టు కోల్‌కతాలో ప్రాక్టీస్‌ ప్రారంభించింది. భారత్‌ యువ ఆటగాళ్లు సత్తా చాటాలన్న తపనతో ఉండగా, సౌతాఫ్రికా తమ సీనియర్‌ బౌలర్లతో కంబ్యాక్‌ టార్గెట్‌ పెట్టుకుంది. కాబట్టి ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగబోయే తొలి టెస్టు రసవత్తరంగా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఐపీఎల్ vs పీఎస్ఎల్..

ఐపీఎల్ vs పీఎస్ఎల్.. ప్రపంచ క్రికెట్‌లో ఐపీఎల్ అప్రతిహత ఆధిపత్యం ప్రపంచవ్యాప్తంగా వ్యూయర్‌షిప్‌లో ఐపీఎల్...

ఆడే టైం అపోయింద‌నే రిటైర్మెంట్ తీసుకున్నా..!

ఆడే టైం అపోయింద‌నే రిటైర్మెంట్ తీసుకున్నా..! రిటైర్మెంట్ నిర్ణ‌యంపై అశ్విన్ తాజాగా కామెంట్స్‌ అప్ప‌ట్లో...

బిగ్ ప్రైజ్‌మ‌నీ

బిగ్ ప్రైజ్‌మ‌నీ భారత జట్టుకు 131 కోట్ల నగదు బహుమతి బీసీసీఐ చరిత్రలోనే అతిపెద్ద...

యుద్ధం మొచ్చినా ఆట ఆగ‌దు..!

యుద్ధం మొచ్చినా ఆట ఆగ‌దు..! వ‌ర‌ల్డ్ ఫుట్ బాల్ టోర్నీపై ఫిఫా స్ప‌ష్ట‌త‌ టోర్నమెంట్...

ఏఐతో నకిలీ ప్రకటనలు.. వివాదాలు

ఏఐతో నకిలీ ప్రకటనలు.. వివాదాలు ఆటగాళ్ల పేరుతో తప్పుడు వ్యాఖ్యలు వైరల్ క్రీడా సంస్థలు...

అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా

అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించిన ఐసీసీ న్యూజిలాండ్...

వాంఖేడేలో సెమీఫైనల్ మహాసంగ్రామం

వాంఖేడేలో సెమీఫైనల్ మహాసంగ్రామం భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు కీలక...

క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ..

క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ.. అనిల్ కుంబ్లే భావోద్వేగ‌మైన పోస్టు..! కాక‌తీయ‌, స్పోర్ట్స్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img