ఘనంగా సైన్స్ దినోత్సవం
కాకతీయ, గీసుగొండ: సైన్స్‌తోనే ఉజ్వల భవిష్యత్తు ముడిపడి ఉందని ప్రగతి హైస్కూల్ కరస్పాండెంట్ చింతం శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని మచ్చాపూరం ప్రగతి హై స్కూల్‌లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు మొత్తం 110 సైన్స్ ఎగ్జిబిట్లను అత్యంత ఉత్సాహంతో ప్రదర్శించారు. విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల సైన్స్ ప్రాజెక్టులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈసందర్భంగా చింతం శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సివి రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ రోజును పురస్కరించుకుని జాతీయ సైన్స్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. అనంతరం నిర్వహించిన సైన్స్ క్విజ్, వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. ప్రిన్సిపాల్ అప్పని విజయ్, ఉపాధ్యాయులు స్వాతి, లవకుమార్, నీలిమ, ఉష, కుమారస్వామి, రాజ్‌కుమార్, గౌతమి, అరుణ తదితరులు పాల్గొన్నారు.


