epaper
Friday, April 17, 2026
epaper

హనియె హత్య.. గంట ముందు గడ్కరీతో భేటీ..!

హనియె హత్య.. గంట ముందు గడ్కరీతో భేటీ..!
ప్రధాని మోదీ తరఫున ఇరాన్‌కు నితిన్ గడ్కరీ
ప్రమాణ స్వీకార వేడుకలో హనియెను ప్రత్యక్షంగా చూసిన మంత్రి
తెల్లవారుజామునే హ‌నియో హత్య వార్త… షాక్‌కు గురైన గడ్కరీ
సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన కేంద్ర మంత్రి గడ్కరీ

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : హమాస్ రాజకీయ నేత ఇస్మాయిల్ హనియె హత్యకు సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనంగా మారాయి. హనియె హత్యకు కేవలం కొన్ని గంటల ముందు తాను అతడిని ప్రత్యక్షంగా కలిసినట్లు గడ్కరీ వెల్లడించారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రమాణ స్వీకారానికి భారత ప్రతినిధిగా తాను తెహ్రాన్‌కు వెళ్లినట్లు గడ్కరీ తెలిపారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఫైవ్‌స్టార్ హోటల్‌లో జరిగిన అనౌపచారిక సమావేశంలో అనేక దేశాల అధినేతలతో పాటు హనియె కూడా ఉన్నాడని చెప్పారు. రాష్ట్రాధినేత కాకపోయినా, హనియె అధ్యక్షుడు, చీఫ్ జస్టిస్‌తో కలిసి కార్యక్రమానికి వెళ్లడాన్ని తాను గమనించినట్లు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం హోటల్‌కు తిరిగి వచ్చిన తనకు, జూలై 31 తెల్లవారుజామున 4 గంటల సమయంలో భారతదేశానికి చెందిన ఇరాన్ రాయబారి వచ్చి వెంటనే అక్కడి నుంచి వెళ్లాలని చెప్పారని గడ్కరీ వివరించారు. అప్పుడే హమాస్ చీఫ్ హనియె హత్యకు గురైనట్లు సమాచారం అందిందని, ఇది తనకు తీవ్ర షాక్ ఇచ్చిందన్నారు.

హత్య ఎలా జరిగిందనే ఇప్పటికీ స్పష్టత లేదు..

ఇరాన్ అధికారుల ప్రకారం, అత్యంత భద్రత కలిగిన ఐఆర్‌జీసీ ఆధీనంలోని సైనిక సముదాయంలో హనియెపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన బాడీగార్డ్ కూడా మృతి చెందాడు. హత్య ఎలా జరిగిందనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదని గడ్కరీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మోసాద్ పాత్రపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పేలుడు పదార్థాల ద్వారా దాడి జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ఇరాన్ భద్రతా వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ… “దేశం బలంగా ఉంటే ఎవరూ దానిపై చేయి వేయలేరు” అంటూ ఇజ్రాయెల్‌ను ఉదాహరణగా ప్రస్తావించడం మరో చర్చకు దారి తీసింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మోదీ, విజయన్‌కు తేడా ఏంలేదు

మోదీ, విజయన్‌కు తేడా ఏంలేదు బీజేపీ తమ ఓటు బ్యాంకును మార్పిడి అయ్యేలా...

మోదీ ఖాతాలో మ‌రో రికార్డు

మోదీ ఖాతాలో మ‌రో రికార్డు భారత రాజకీయాల్లో నూతన మైలురాయి! ప్రభుత్వ అధినేతగా అత్య‌ధిక...

గ్రీన్ లాండ్‌ను మేం ర‌క్షిస్తాం

గ్రీన్ లాండ్‌ను మేం ర‌క్షిస్తాం ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కౌంటర్ కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్...

ఎల్పీజీ సంక్షోభానికి ఊరట

ఎల్పీజీ సంక్షోభానికి ఊరట మంగళూరు పోర్టుకు చేరిన‌ గ్యాస్ ట్యాంకర్లు వచ్చే వారం భారీ...

పంజాబ్‌లో మాజీ మంత్రిపై కేసు

పంజాబ్‌లోమాజీ మంత్రిపై కేసు గగన్‌దీప్ సింగ్ రంధావా ఆత్మహత్య కేసులో మ‌లుపు వేధింపుల ఆరోపణలపై...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ప్రియుడితో పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా..!

ప్రియుడితో పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా..! స్టేష‌న్‌కు చేరుకున్న కుంభ‌మేళా బ్యూటీ ల‌వ్ మ్యాట‌ర్‌ తండ్రి...

108మంది మావోయిస్టుల లొంగుబాటు

108మంది మావోయిస్టుల లొంగుబాటు స‌రెండ‌ర‌యిన వారిలో 44 మంది మహిళా మావోయిస్టులు 101 అత్యాధునిక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img