epaper
Sunday, March 1, 2026
epaper

గ్యారెంటీ కార్డులు గాలికే…

గ్యారెంటీ కార్డులు గాలికే…
ఇచ్చిన హామీలు నెరవేర్చాకే ఓట్లు అడగాలి
రెండున్నరేళ్లైనా ప‌థ‌కాల‌ అమలు లేదు
కేసీఆర్ హయాంలోనే మధిరలో అసలైన అభివృద్ధి
ఎన్నికల వేళ కాంగ్రెస్ హడావుడి రాజకీయమే
కాంగ్రెస్‌పై మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌ర్ రావు ఫైర్
మధిరలో గులాబీ ప్ర‌చార హోరు

కాకతీయ, బోనకల్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు మధిర పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు హోరెత్తించాయి. 4, 11, 12, 13, 14, 17, 18, 20, 21, 22 వార్డుల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మధిర అసెంబ్లీ ఇంచార్జి లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులతో కలిసి గులాబీ శ్రేణులు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మధిర ప్రజలను ఓట్లు అడగాలంటే ముందుగా భట్టి విక్రమార్క ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గ్యారెంటీ కార్డుల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, రెండున్నరేళ్లు గడిచినా వాటిలో ఒక్క హామీ కూడా అమలుకాలేదని మండిపడ్డారు.

కాంగ్రెస్ హామీలపై నిలదీత
అసెంబ్లీ ఎన్నికల ముందు మూడు నెలల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలని నామ ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. ఎన్నికలు రాగానే హడావుడిగా శంకుస్థాపనలు, నిధుల ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. రెండేళ్లు నిద్రపోయిన కాంగ్రెస్‌కు ఇప్పుడు మధిర అభివృద్ధి గుర్తుకొచ్చిందా? అని ఘాటుగా నిలదీశారు. ప్రజలు ఈ నాటకాలను గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి
మధిర పట్టణంలో జరిగిన అభివృద్ధి అంతా కేసీఆర్ పాలనలోనే జరిగిందని నామ స్పష్టం చేశారు. 100 పడకల ఆసుపత్రి, ట్యాంక్‌బండ్ నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సెంట్రల్ లైటింగ్, పార్కులు, డివైడర్లు వంటి అనేక పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయని గుర్తు చేశారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్ సమస్యలు లేకుండా మధిరను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, వారి సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని నామ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలన – కాంగ్రెస్ పాలన మధ్య తేడాను ప్రజలు గమనించి, అభివృద్ధికి అండగా నిలవాలని కోరారు. మధిర ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని, గులాబీ జెండాకు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img