epaper
Sunday, March 1, 2026
epaper

బీజేపీలోకి పేరం గోపికృష్ణ‌.. రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద‌ర్‌రావు స‌మక్షంలో చేరిక‌

బీజేపీలోకి పేరం గోపికృష్ణ‌
రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద‌ర్‌రావు స‌మక్షంలో చేరిక‌
ఉన్న‌త విద్యావంతుడు పార్టీలోకి రావ‌డం అభినంద‌నీయం
క‌ష్ట‌ప‌డి పనిచేస్తే ప్ర‌తీ ఒక్క‌రికి పార్టీలో ఉన్న‌త అవ‌కాశాలు
పార్టీ ఫ‌స్ట్‌.. ప‌ర్స‌న్ నెక్ట్స్ ల‌క్ష్యంతో ప‌నిచేయాలి
చేరిక సంద‌ర్భంగా రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు సూచ‌న‌లు
ప్ర‌జా సేవ చేసేందుకే రాజ‌కీయాల్లోకి : గోపికృష్ణ‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ప్ర‌భుత్వ ఉద్యోగానికి స్వ‌చ్చంద రాజీనామా చేసిన పేరం గోపికృష్ణ శుక్ర‌వారం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు స‌మక్షంలో కాషాయం కండువా క‌ప్పుకున్నారు. హ‌న్మ‌కొండ జిల్లా పెగ‌డ‌ప‌ల్లి గ్రామానికి చెందిన గోపికృష్ణ ఇటీవ‌ల ప్ర‌భుత్వ ఉద్యోగానికి స్వ‌చ్ఛందంగా రాజీనామా చేశారు. రాష్ట్ర ఇరిగేష‌న్ శాఖ‌లో డీఈగా ప‌నిచేసిన గోపికృష్ణ రాజ‌కీయాల‌పై ఆస‌క్తితో బీజేపీలో చేరారు. హ‌న్మ‌కొండ నుంచి త‌న అనుచ‌రుల‌తో భారీ కాన్వాయ్‌తో బ‌య‌ల్దేరి వెళ్లిన గోపికృష్ణను రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈసంద‌ర్భంగా పార్టీ కార్యాల‌యంలో రాష్ట్ర ముఖ్య నేత‌ల స‌మ‌క్షంలో కాషాయ కండువా క‌ప్పారు. ఈసంద‌ర్భంగా రాంచంద‌ర్‌రావు మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుడైన గోపికృష్ణ పార్టీలో చేర‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.

ప‌నిచేస్తేనే జ‌నంలో గుర్తింపు..!

హ‌న్మ‌కొండ‌లో భార‌తీయ జ‌నతా పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాల‌ని ఈసంద‌ర్భంగా గోపికృష్ణ‌కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు సూచించారు. పార్టీ ఫ‌స్ట్‌.. ప‌ర్స‌న్ నెక్ట్స్ అనే ఆలోచ‌న‌తో ప‌నిచేయాల‌ని, అంకితాభావంతో ప‌నిచేసే వారికి త‌ప్ప‌కుండా పార్టీలో మంచి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని అన్నారు. జ‌నంలో ఉంటూ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గుర్తించి.. వారికి అండ‌గా ఉన్న వారికి జ‌నం నేత‌ల వెంట ఉంటార‌ని అన్నారు. ప్ర‌జా సమ‌స్య‌ల‌పై పోరాడుతూ.. నిత్యం జ‌నంలో ఉండే నాయ‌కులకు త‌ప్ప‌కుండా రాజ‌కీయంగా నిల‌దొక్కుకోగ‌లుగుతార‌ని అన్నారు. పార్టీలో అంద‌రితో స‌మ‌న్వ‌యంతో ముందుకెళ్లాల‌ని అన్నారు. సుదీర్ఘ‌కాలం ప్ర‌భుత్వ ఉద్యోగిగా కొన‌సాగిన గోపికృష్ణ మంచి జ‌న‌నేత‌గా ఎద‌గాల‌ని ఆకాంక్షించారు. ఇదిలా ఉండ‌గా బీజేపీలో జాయిన్ అయిన గోపికృష్ణ‌కు హ‌న్మ‌కొండ జిల్లా అధ్య‌క్షుడు సంతోష్‌రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాల‌ని ఈసంద‌ర్భంగా గోపికృష్ణ‌కు సూచించారు.

ప్ర‌జా సేవ చేసేందుకే రాజ‌కీయాల్లోకి : గోపికృష్ణ‌

ప్ర‌జా సేవ చేసేందుకే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు పేరం గోపికృష్ణ తెలిపారు. పార్టీలో సామాన్య కార్య‌క‌ర్త‌గా ప‌నిచేయ‌డానికి సిద్దంగా ఉన్నాన‌ని, పార్టీ ఏ బాధ్య‌త‌లు అప్ప‌గించినా అంకితాభావంతో ప‌నిచేస్తాన‌ని అన్నారు. రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు మార్గ‌ద‌ర్శ‌కంలో హ‌న్మ‌కొండ‌లో పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి త‌న వంతుగా కృషి చేస్తాన‌ని తెలిపారు. న‌రేంద్ర‌మోదీ నాయ‌క‌త్వంలో దేశం ఎంతో ప్ర‌గ‌తి, ఆత్మగౌర‌వంతో కూడిన అభివృద్ధి సాధిస్తోంద‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను, అభివృద్ధి ప‌నుల‌ను జ‌నంలోకి తీసుకెళ్ల‌డం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తాన‌ని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img