మృతుడి కుటుంబానికి స్నేహితుల సాయం
కాకతీయ, ఆత్మకూరు : చిన్ననాటి స్నేహితులకు కష్ట సుఖాల్లో అండగా ఉంటామని 1995-96 పదోతరగతి స్నేహితులు అన్నారు.శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో ఇటీవలే మృతిచెందిన బయ్యా పైడి రాజు కుటుంబానికి 1995-96 పూర్వ విద్యార్థులు అండగానిలిచి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పూర్వవిద్యార్థులు మాట్లాడుతు చిన్ననాటి జ్ఞాపకాలు కలిసి గడిపిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ మిత్రులు భావోద్వేగానికి లోనయ్యారు.ఎల్లవేళలా స్నేహితుల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటామని తెలుపుతు మృతిని కుటుంబానికి 40,000 వేల ఆర్ధిక సహాయం అందచేశారు.పైడి రాజు పిల్లల భివిష్యత్ కొరకు మరింత తోచిన సహాయం చేస్తామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.పాఠశాల రోజులల్లో ఏర్పడిన స్నేహ బంధం జీవితాంతం నిలుస్తుందని తెలిపారు.


