కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి ఉంది. కానీ ప్రజావ్యతిరేకత, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలు నిర్వహించేందుకు భయపడుతోంది. ఎన్నికలకు జంకుతుండటంతో ప్రస్తుతం పంచాయితీల్లో ప్రత్యేక అధికారుల పరిపాలన ఇంకా సాగుతోంది. కొన్ని నెలలుగా పంచాయితీల్లో పాలన కుంటుపడింది. పంచాయతీలు అభివ్రుద్ధి నోచుకోకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది.
గ్రామ పంచాయతీ ఎన్నికలపై కసరత్తు ప్రారంభించింది. ఈ సందర్భంగా ఓటర్ జాబితాపై ఓ కీలక ప్రకటన చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణఖు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఓటర్ల డ్రాఫ్ట్ రూపకల్పనతో పాటుగా తుది ఓటర్ల జాబితా విడుదల ఇలా మొత్తం ప్రక్రియకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది.
తేదీలు కార్యాచరణ
28 ఆగస్టు డ్రాఫ్ట్ రూపకల్పన
29 ఆగస్టు జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల అధికారుల సమావేశం
30 ఆగస్టు మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓల సమావేశం
28 ఆగస్టు నుంచి 30 ఆగస్టు వరకు గ్రామీణ అసెంబ్లీ ఓటర్లు, వార్డుల వారీగా ఓటర్ల రీఅరెంజ్‌మెంట్ చేయడం.
31 ఆగస్టు జిల్లా పంచాయతీ అధికారి అభ్యంతరాలు
2 సెప్టెంబర్ గ్రామ పంచాయతీ ఓటర్ల తుది జాబితాల విడుదల



