epaper
Sunday, March 1, 2026
epaper

“మా జీవితాలు బుగ్గి కావాలా..?” ఆనందాపురంలో గిరిజనుల ఆవేదన

“మా జీవితాలు బుగ్గి కావాలా..?” ఆనందాపురంలో గిరిజనుల ఆవేదన
అగ్రకుల ఆధిపత్యంపై సర్పంచ్ సమ్మయ్య ఆగ్రహం
నాలుగు ఎకరాల భూమి అక్రమ పట్టాల ఆరోపణలు
రెవెన్యూ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా
న్యాయపోరాటానికి సిద్ధమంటున్న గ్రామస్థులు

కాకతీయ, మణుగూరు/అశ్వాపురం : “అగ్రకుల ఆధిపత్యంలో మా జీవితాలు బుగ్గి కావాలా… ఇంకా ఎన్నాళ్లు ఈ చెర?” అంటూ ఆనందాపురం గ్రామంలో గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ ముర్రం సమ్మయ్య ఆధ్వర్యంలో శనివారం గ్రామస్థులు రోడ్డు బెటాయించి ధర్నా నిర్వహించారు. సమ్మయ్య మాట్లాడుతూ గత నలభై ఏళ్లుగా గ్రామంలో అధికార పార్టీకి చెందిన ప్రభావశీలులు ప్రజా ప్రతినిధులుగా చలామణి అవుతూ గిరిజన కుటుంబాలకు చెందిన నాలుగు ఎకరాల భూమిని బెదిరింపులతో ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తమ కుల పెద్దలను భయపెట్టి భూమిపై అడుగుపెట్టనివ్వలేదని, అనంతరం అక్రమ పట్టాలు పొందారని చెప్పారు. ఈ విషయంపై ప్రశ్నించగానే తమపై కేసులు బనాయించి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. భూమి తమదేనని రెవిన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసినప్పటికీ ఇప్పటివరకు స్పందనలేదన్నారు. గిరిజనుడు సర్పంచ్‌గా ఎన్నిక కావడం కొందరికి నచ్చలేదని, అందుకే కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమ భూములు తిరిగి అప్పగించేవరకు పోరాటం ఆగదని, అవసరమైతే ఐటిడిఎ అధికారులు, జిల్లా కలెక్టర్‌ను కలిసి న్యాయపోరాటానికి సిద్ధమవుతామని స్పష్టం చేశారు. “మా భూములను వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని గిరిజనులు హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

పంచాయతీ కార్మికులకు భరోసా.. 15 లక్షల ప్రమాద బీమా

పంచాయతీ కార్మికులకు భరోసా.. 15 లక్షల ప్రమాద బీమా కాకతీయ, చింతకాని :...

ఇసుక మాఫియాపై ఉక్కుపాదం

ఇసుక మాఫియాపై ఉక్కుపాదం సరిహద్దుల్లో విజిబుల్ పోలీసింగ్ పటిష్టం చేయాలి అక్రమ రవాణాపై కేసులు,...

హామీలు అడిగితే దాడులా..? రేగళ్ల పెద్దతండాలో ఉద్రిక్తత

హామీలు అడిగితే దాడులా..? రేగళ్ల పెద్దతండాలో ఉద్రిక్తత సర్పంచ్ అనుచరుల దాడి ఆరోపణలు లక్ష్మీదేవిపల్లి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img