కూలీ కథ లీకైందా..!?
యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబోలో తెరకెక్కి మరో రెండు వారాల్లో థియేటర్లకు వస్తున్నచిత్రం ‘కూలీ’ (Coolie). ఈ చిత్ర కథ ఏమై ఉంటుందన్నదానిపై కోలీవుడ్‌లో గత కొన్ని నెలలుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇపుడు ఆ చిత్ర కథాంశం లీకైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రిలీజ్‌కు రెండు వారాల ముందు విదేశీ సెన్సార్‌షిప్ కోసం తాజాగా దరఖాస్తు చేసింది. అందులోని సమాచారం మేరకు.. ‘కార్మిక సంఘాలు, రహస్యంగా సాగే అక్రమ రవాణా ముఠాల నేపథ్యం, రోజు వారీ కూలీలను అత్యంత కిరాతకంగా వేధించే ముఠాకు వ్యతిరేకంగా పోరాడే ధైర్యవంతుడైన కార్మికుడి పోరాటమే ఈ సినిమా మూల కథాంశం. ఇదిలా ఉండగా ఈ సినిమాలోని కొంత భాగంగా లీకైనట్లుగా వార్తలు వస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.




