అశ్వారావుపేటలో కాంగ్రెస్ ఘన విజయం
19 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం
బీఆర్ఎస్కు 2 స్థానాలు మాత్రమే
బీజేపీ ఒక వార్డులో ఖాతా ఓపెన్
మున్సిపాలిటీపై కాంగ్రెస్ స్పష్టమైన ఆధిపత్యం
కాకతీయ, అశ్వారావుపేట : అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 22 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 19 వార్డులను కైవసం చేసుకుని మున్సిపాలిటీపై స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రారంభ రౌండ్ల నుంచే కాంగ్రెస్ అభ్యర్థులు వరుస విజయాలతో దూసుకెళ్లి ప్రత్యర్థులకు అవకాశమే ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ కేవలం 2 వార్డుల్లో మాత్రమే విజయం సాధించగా, బీజేపీ ఒక వార్డులో గెలిచి ఖాతా తెరిచింది. అయితే మొత్తం ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఆధిక్యం సాధించినట్లు స్పష్టమవుతోంది. పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం కనిపించగా, అభ్యర్థుల వ్యక్తిగత ప్రభావం, స్థానిక అంశాలపై ఇచ్చిన హామీలు పార్టీ విజయానికి దోహదపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫలితంతో అశ్వారావుపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో చేరింది.


