epaper
Monday, March 2, 2026
epaper

ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్సుకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు ..!!

*ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్య‌వ‌స్థ‌తో సత్వర న్యాయం
*మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలతో వివాదాలకు పరిష్కారం
*విశాఖలో ఏడీఆర్ సెంటర్ ఏర్పాటుకు సిద్ధం
*ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్సుకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు

కాక‌తీయ‌, అమ‌రావ‌తి : ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ వ్యవస్థలో మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలే ముఖ్య భూమిక పోషిస్తాయని అన్నారు. శుక్రవారం విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ద్వారా న్యాయం అందరికీ అందుబాటులోకి రావటంతో పాటు వేగంగా సమర్థవంతంగా చేరుతుందన్నారు. మీడియేషన్ అంశం భారత్ కు కొత్తకాదని తరాలుగా మనకు అందుబాటులో ఉందని తెలిపారు.

పురాణాల్లో శ్రీకృష్ణుడు ఓ సమర్ధవంతమైన మీడియేటర్ గా వ్యవహరించారని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో మన పూర్వీకులు, గ్రామపెద్దలు సమర్ధంగా మీడియేషన్ ప్రక్రియను నిర్వహించేవారని తెలిపారు. ముఖ్యమంత్రి ఇంకా మాట్లాడుతూ.. ” విశాఖపట్నంలో జ్యుడీషియల్, మధ్యవర్తిత్వ రంగాలపై చారిత్రాత్మక కాన్ఫరెన్స్ నిర్వహించటం సంతోషదాయకం. ప్రజాస్వామ్యంలో భారతీయ న్యాయవ్యవస్థ ఓ మూల స్తంభం. రాజ్యాంగపరమైన హక్కుల్ని, చట్టాన్ని కాపాడే అత్యంత కీలకమైన వ్యవస్థ. నిబద్ధతకు, నిష్పాక్షికతకు, పారదర్శకతకు పెట్టింది పేరు. కొన్ని సమయాల్లో కాస్త ఆలస్యమైనా న్యాయం దక్కుతుందనే నమ్మకం ప్రతీ పౌరుడికీ ఉంది.

భారత్ అత్యంత వేగంగా సంస్కరణల్ని అమలు చేస్తోంది. గత ఏడాదిగా ఏపీలో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయి. ప్రతిష్టాత్మక సంస్థలు తమ కార్యకలాపాలు ఏర్పాటు చేస్తున్నాయి. కంపెనీలు, వ్యవస్థలు వస్తున్న నేపథ్యంలో వివాదాల పరిష్కారానికి మీడియేషన్ లాంటి ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థలు అందుబాటులోకి రావాలి. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టం రావాలి. సులభంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు టెక్నాలజీని కూడా అందిపుచ్చుకోవాలి.” అని అన్నారు.

విశాఖలో ఏడీఆర్ ఎకో సిస్టం ఏర్పాటుకు సిద్ధం

విశాఖలో ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఎకో సిస్టం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. పెరిగిపోతున్న వివాదాలు, కేసుల పరిష్కారానికి కొత్తగా కోర్టులు ఏర్పాటు చేయటంతో పాటు మీడియేషన్, ఆర్బిట్రేషన్ కు కొత్త వ్యవస్థలు రావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికీ చాలా మంది పౌరులు కేసులు దాఖలు చేసి కోర్టులకు వెళ్లటం అవమానంగా భావిస్తారని దీన్ని మీడియేషన్ ప్రక్రియ చక్కని పరిష్కారమని అన్నారు.

దేశం అమలు చేస్తున్న సంస్కరణలు, కొత్త వ్యవస్థలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వివాదాలు తగ్గించుకోవటమే ఆర్ధిక వ్యవస్థకు కీలకం అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దానికి అనుగుణంగా వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలను రూపోందించుకోవాల్సి ఉందన్నారు. ఈజ్ ఆఫ్ జస్టిస్ ప్రక్రియలో భాగంగా వర్చువల్ హియరింగ్స్, ఈ-ఫైలింగ్, మొబైల్ అప్‌డేట్స్ లాంటి సాంకేతికతను అమలు చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పీఎస్ నరసింహ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఇతర న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు హాజరయ్యారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేలిపోయిన‌ బ‌తుకులు

పేలిపోయిన‌ బ‌తుకులు వేట్లపాలెంలో బాణసంచా పేలుడు సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ కేంద్రంలో ఘోర ప్రమాదం 23 మంది...

వెట్లపాలెం బాణాసంచా కర్మాగ‌రంలో పేలుళ్లు!

వెట్లపాలెం బాణాసంచా కర్మాగ‌రంలో పేలుళ్లు! సజీవదహనమైన 18 మంది కార్మికులు తీవ్రంగా గాయపడిన మరో...

మా ఊరి తంగేడు పూలు ఖ్యాతిని తెచ్చిపెట్టింది

మా ఊరి తంగేడు పూలు ఖ్యాతిని తెచ్చిపెట్టింది ప్రముఖ రచయిత్రి కొంకేపూడి అనురాధ తెలుగు...

ల‌డ్డూ క‌ల్తీ దోషులను వదిలిపెట్టం

ల‌డ్డూ క‌ల్తీ దోషులను వదిలిపెట్టం నిజాలు దాచితేనే మహాపాపం ప్రజల దృష్టికి తీసుకెళ్లడం...

తిరుమలలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

తిరుమలలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు అర్ధరాత్రి నుంచే వైకుంఠద్వార దర్శనం ఆరంభం గోవింద...

చంద్రబాబు పాలనలో ప్రజా సేవలు ప్రైవేటు చేతుల్లోకి : పేర్ని నాని

చంద్రబాబు పాలనలో ప్రజా సేవలు ప్రైవేటు చేతుల్లోకి : పేర్ని నాని కాకతీయ,...

ఇస్రో ప్ర‌యోగం స‌క్సెస్‌

ఇస్రో ప్ర‌యోగం స‌క్సెస్‌ కక్ష్యలోకి అమెరికా బ్లూబర్డ్ బ్లాక్–2 భారీ ఉప‌గ్ర‌హం ఎల్‌వీఎం3–ఎం6 ద్వారా...

టీటీడీలో మరో కుంభకోణమా?

టీటీడీలో మరో కుంభకోణమా? గోవిందరాజస్వామి గోపురం బంగారు తాపడంపై అనుమానాలు విమాన గోపురం బంగారు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img