వైద్య రంగాన్ని మార్చేస్తున్న కృత్రిమ మేధ
ఇమేజ్ విశ్లేషణ నుంచి రోబోటిక్ శస్త్రచికిత్సల దాకా వినియోగం
ఎస్‌బీఐటీ కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ
కాకతీయ, ఖమ్మం : వైద్య రంగంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తూ పనితీరును పూర్తిగా మారుస్తోందని కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. గురువారం ఎస్‌బీఐటీ కళాశాల ఆవరణలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు. వైద్య పరీక్షలు, ఇమేజ్ విశ్లేషణ, రోబోటిక్ శస్త్రచికిత్సలు, రోగ నిర్ధారణలో ఆధునిక సాంకేతిక సహాయాన్ని కృత్రిమ మేధ అందిస్తోందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రమోద పాత్రోను విద్యార్థుల సమక్షంలో ఘనంగా సత్కరించారు. కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్‌షాప్ విద్యార్థులకు కృత్రిమ మేధ వినియోగంపై అవగాహన పెంపొందిస్తుందని కళాశాల కార్యదర్శి జి. ధాత్రి తెలిపారు. ఎక్స్‌రేలు, ఎంఆర్‌ఐ, సీటి స్కాన్, పాథాలజీ నివేదికలను విశ్లేషించి ఖచ్చితమైన చికిత్స సూచించడంలో ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ కొత్త ఔషధాల అభివృద్ధిలో కృత్రిమ మేధ వేగాన్ని పెంచిందన్నారు. రోబోటిక్ శస్త్రచికిత్సల ద్వారా రోగులు త్వరగా కోలుకునే అవకాశముందని వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ జి. రాజ్‌కుమార్ మాట్లాడుతూ హృదయ స్పందన, రక్తపోటు, ఆక్సిజన్ స్థాయిల వంటి ఆరోగ్య డేటాను నిరంతరం విశ్లేషించడంలో కృత్రిమ మేధ కీలకమని అన్నారు. కార్యక్రమంలో కళాశాల అకడమిక్ డైరెక్టర్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


