కాకతీయ, బయ్యారం: భూభారతి పోర్టల్ ద్వారా కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారు 5 జూన్ 2025 వరకు రెవెన్యూ పట్టా కానీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టా వచ్చిన వాళ్ళు మాత్రమే రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రాంజీ సోమవారం తెలిపారు.ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదు.
రైతు బీమా లో నామిని పేరు, ఫోన్ నెంబర్ మార్పు చేసుకోవడానికి కూడ అవకాశం ఈ నెల 12 తేదీ వరకు మాత్రమే ఉందన్నారు.18 నుంచి 59 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి మాత్రమే అర్హులు. ఈ తేది నుండి 14-08-1966 నుండి 14-08-2007 వరకు మధ్యలో జన్మించిన వారు మాత్రమే రైతు బీమా కీ అర్హులు అన్నారు..దీనికి కావలసిన ధృవ పత్రాలు,అప్లికేషన్ ఫారం, రైతు పట్టా పాస్ బుక్, రైతు ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డ్, ప్రతి రైతు మీ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి ని సంప్రదించలన్నారు.


