యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి…
కాకతీయ, గూడూరు: యూరియా కోసం వెళ్తు రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెంది మరొకరు తీవ్ర గాయల పాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఘటన ఆదివారం ఉదయం మహబూబాబాద్ నుండి గూడూరు వెళ్లే జాతీయ రహదారిపై జగన్నాయకులగూడెం స్టేజి వద్ద జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం దుబ్బగూడెం కు చెందిన దారావత్ వీరన్న బానోత్ లాల్య ఇద్దరు కలసి ద్విచక్ర వాహనంపై యూరియా టోకెన్ కోసం బొద్దుగొండకు వెళ్తుండగా మహబూబాబాద్ నుండి గూడూరు వైపు వెళ్తున్న బొలెరో వాహనం అతివేగంగా వచ్చి టూ వీలర్ ను ఢీ కొనడంతో బానోత్ వాల్య అక్కడికక్కడే మృతి చెందగా దారవత్ వీరన్నకు తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా ఉండటంతో ఘటన స్థలికి చేరుకున్న గూడూరు సిఐ సూర్య ప్రకాష్ తన వాహనం లో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.


