- చిన్నారి పసుపులేటి వీక్షకు అభినందనల వెల్లువ
కాకతీయ, ఖమ్మం ఎడ్యుకేషన్: స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్థిని పసుపులేటి వీక్ష జాతీయస్థాయి స్కేటింగ్ పోటీలకు ఎంపికైంది. వీక్ష హైదరాబాదులో నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ 2025 రాష్ట్ర స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలలో రెండు విభాగాలలో పతకాలను సొంతం చేసుకుంది. 400 మీటర్ల రోలర్ స్కేటింగ్ లో సిల్వర్ మెడల్, మరో విభాగం 600 మీటర్ల స్కేటింగ్లో మరో సిల్వర్ మెడల్ ను సాధించి డిసెంబర్ లో జరిగే జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలకు ఎంపికైంది. అదేవిధంగా జిల్లాస్థాయి స్కేటింగ్ పోటీలలో 600 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్ ను, 400 మీటర్ల స్కేటింగ్ విభాగంలో సిల్వర్ మెడల్ ను సాధించింది. వీక్షను పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య బుధవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మెడల్స్ అందించి అభినందించారు. వీక్ష జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలకు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. చిన్నారిని పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్,ఉపాధ్యాయులు అభినందించారు.


