కాకతీయ, బిజినెస్ డెస్క్: ప్రభుత్వం ఆధార్ సేవలను మరింత సులభతరం చేస్తూ, పౌరులు వేగంగా తమ ఆధార్ కార్డును పొందే విధంగా కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు DigiLocker లేదా UIDAI వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆధార్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు, ఆధార్ కార్డును WhatsApp ద్వారా నేరుగా పొందే సౌకర్యం ప్రారంభమైంది.
ఈ సదుపాయం MyGov హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్ ద్వారా లభిస్తుంది. అంటే, మీరు వెబ్‌సైట్‌లు తిరగకుండా, కొన్ని సులభమైన మెసేజ్‌లతోనే ఆధార్‌ను మీ ఫోన్‌లో పొందవచ్చు. ఈ కొత్త సేవ ప్రత్యేకంగా అత్యవసర పరిస్థితుల్లో, ఎప్పటికప్పుడు ఆధార్ అవసరమయ్యే సందర్భాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇప్పుడు WhatsAppలో ఆధార్ డౌన్‌లోడ్ చేయాలంటే చేయాల్సిన దశలు చూద్దాం:
*ముందుగా మీ ఫోన్‌లో WhatsApp యాప్ ఇన్‌స్టాల్ చేసి ఉండాలి.
*తర్వాత, MyGov హెల్ప్‌డెస్క్ అధికారిక నంబర్ 9013151515 ను మీ ఫోన్ కాంటాక్ట్స్‌లో సేవ్ చేయండి.
*WhatsApp ఓపెన్ చేసి, ఆ నంబర్‌కి “Hi” లేదా “Namaste” అని మెసేజ్ పంపండి.
*కొద్ది సెకండ్లలో చాట్‌బాట్ నుంచి రిప్లై వస్తుంది. అందులోని ఆప్షన్లలో “DigiLocker Services” ను ఎంచుకోండి.
*తర్వాత మీ 12 అంకెల ఆధార్ నంబర్ ని టైప్ చేయండి.
*మీ ఆధార్‌కు లింక్ అయిన DigiLocker అకౌంట్ ని ధృవీకరించండి.
* మీ ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌కి వచ్చే OTP (ఒకసారి ఉపయోగించే పాస్‌వర్డ్) ను నమోదు చేయండి.
*చాట్‌బాట్ మీకు అందుబాటులో ఉన్న డాక్యుమెంట్ల జాబితాను చూపుతుంది.
*ఇందులో నుండి Aadhaar ఎంపిక చేసుకోండి, అంతే మీ ఆధార్ కార్డు PDF వెర్షన్ నేరుగా మీ WhatsAppలోకి వస్తుంది.
*ఒకసారి ఒకే డాక్యుమెంట్‌ను మాత్రమే పొందగలరని గమనించాలి. అలాగే, మీ ఆధార్ ఇప్పటికే DigiLocker అకౌంట్‌తో లింక్ అయి ఉండాలి.
ఇతర మార్గాలు:
*WhatsApp ద్వారా కాకుండా, మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు OTP లేకుండా చేయాలనుకుంటే, మీ పేరు, లింగం, జన్మతేది వంటి వివరాలు ఇవ్వడం ద్వారా, mAadhaar యాప్ ద్వారా జనరేట్ చేసిన TOTP (Time-based OTP) ను ఉపయోగించవచ్చు.
* ఇక మీరు e-Aadhaar అనే ఎలక్ట్రానిక్ వెర్షన్‌ను కూడా ఫోన్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఇది భౌతిక కార్డు లాగే చెల్లుబాటు అయ్యే ID ప్రూఫ్‌గా ఉపయోగించవచ్చు. అయితే, దీన్ని ప్రింట్ చేయడం సాధ్యం కాదు.
*ప్రభుత్వం ఈ కొత్త సదుపాయాన్ని అందించడం వెనుక ఉద్దేశం.. పౌరులకు అవసరమైన ప్రభుత్వ పత్రాలను వేగంగా, సులభంగా అందించడమే. MyGov హెల్ప్‌డెస్క్ ఈ దిశగా పౌరసేవను మరింత సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లింది.
*ఇక భవిష్యత్తులో PAN, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను కూడా WhatsApp ద్వారా పొందే అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ముఖ్యాంశాలు:
*ఆధార్ ఇప్పుడు WhatsApp ద్వారా కూడా అందుబాటులో
*MyGov హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేయవచ్చు
*OTP లేదా TOTP ద్వారా ధృవీకరణ అవసరం
DigiLocker లింక్ తప్పనిసరి


