- మృతుని కుటుంబానికి రూ. 5వేల ఆర్థికసాయం
కాకతీయ, పినపాక: కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామంలో కొమరం నాగేశ్వరరావు అనే వ్యక్తి అనారోగ్యంతో గత 25 రోజుల నుంచి హాస్పటల్ లో చికిత్స పొందుతూ గురువారం హైదరాబాదులో మృతి చెందాడు. అతనికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని వారు కూడా చిన్న పిల్లలని తెలుసుకున్న బయ్యారం అటవీ రేంజ్ ఆఫీసర్ తేజస్విని వారికి తన వంతు ఆర్థిక సహాయంగా 5 వేల రూపాయల సహాయం సహాయ అధికారి సాంబశివరావు ద్వారా అందజేశారు. ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించారు.


