ఖమ్మం జిల్లా కమలదళం ఇదే.
బీజేపీ ఖమ్మం టీం ను ప్రకటించిన నెల్లూరి.
యువతకు పెద్ద పీట – సమతుల్య ప్రాతినిధ్యం.
పార్టీ విస్తరణ, బలోపేతం లక్ష్యంగా 20 మంది జట్టు.
స్థానిక ఎన్నికల దిశగా బలమైన బృందం సిద్ధం.
కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పార్టీ బలోపేతం, విస్తరణ లక్ష్యంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం ప్రకటించారు. మొత్తం 20 మంది సభ్యులతో కూడిన ఈ బృందంలో యువతకు ప్రాధాన్యం ఇచ్చారు.
జిల్లా అధ్యక్షుడు నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసే క్రమంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం, యువ నాయకత్వానికి ప్రాధాన్యం, అనుభవజ్ఞులకు బాధ్యతలు ఇచ్చేలా సమతుల్యత పాటించారు. ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఆరుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు కార్యదర్శులు, అలాగే ఐటీ, సోషల్ మీడియా, మీడియా కన్వీనర్, కార్యాలయ కార్యదర్శి, కోశాధికారి వంటి బాధ్యతలతో సమగ్రమైన బృందం ప్రకటించారు.
ఈ సందర్భంగా నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ “పార్టీ అభివృద్ధి, ప్రజా సేవే మా ప్రధాన ధ్యేయం. ప్రతి కార్యకర్త, నాయకులు ప్రజల్లోకి వెళ్లి బీజేపీ సిద్ధాంతాలను విస్తరించాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలం మరింత పెరిగేలా అందరం కలసి కృషి చేద్దాం” అని పిలుపునిచ్చారు.
భారతీయ జనతా పార్టీ – ఖమ్మం జిల్లా నూతన కార్యవర్గం*
జిల్లా ఉపాధ్యక్షుడు – వీరవెల్లి రాజేష్
జిల్లా ఉపాధ్యక్షుడు – సుదర్శన్ మిశ్రా
జిల్లా ఉపాధ్యక్షుడు – బానోత్ రవి రాథోడ్
జిల్లా ఉపాధ్యక్షుడు – నకిరకంటి వీరభద్రం
జిల్లా ఉపాధ్యక్షుడు – బట్టు వీరంరాజు
జిల్లా ఉపాధ్యక్షుడు – బందారు నరేష్
జిల్లా ప్రధాన కార్యదర్శి – గుత్తా వెంకటేశ్వర్లు
జిల్లా ప్రధాన కార్యదర్శి – నల్లగట్టు ప్రవీణ్ కుమార్
జిల్లా ప్రధాన కార్యదర్శి – నాయుడు రాఘవరావు
జిల్లా కార్యదర్శి – పమ్మి అనిత
జిల్లా కార్యదర్శి – కుంచం కృష్ణరావు,
జిల్లా కార్యదర్శి – తమ్మెర రాజిని రెడ్డి
జిల్లా కార్యదర్శి – రామసెట్టి నాగేశ్వరరావు
జిల్లా కార్యదర్శి – తోండేపు సాయి దేశ్వరరావు
జిల్లా కార్యదర్శి – పల నాగ సురేందర్ రెడ్డి
కోశాధికారి – కోనతం లక్ష్మీనారాయణ
మీడియా కన్వీనర్ – నెల్లూరి బేనర్జీ
సోషల్ మీడియా ఇన్‌చార్జ్ – కంధుల శ్రీకృష్ణ
ఐటీ ఇన్‌చార్జ్ – బోయినపల్లి సురేష్
కార్యాలయ కార్యదర్శి – నక్కల రవి గౌడ్
నూతనంగా నియమితులైన సభ్యులందరికీ పార్టీ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ పునాదులు గ్రామ స్థాయిలో మరింత బలపడేలా ఈ బృందం కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తమైంది.
ఖమ్మం జిల్లా కమలదళం ఇదే
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


