లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు
పట్టు వస్త్రాలు సమర్పణ
కాకతీయ, జగిత్యాల : ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ దంపతులు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి కలెక్టర్ దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పారిశుద్ధ్యం, శానిటేషన్, సురక్షిత త్రాగునీటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో, జిల్లా అధికారులు, దేవస్థాన ఈవో, మున్సిపల్ అధికారులు, పోలీస్ సిబ్బంది, దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


