న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ అండర్ రైల్వే గేట్ కరీమాబాద్ లోని న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమన్ హై స్కూల్లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఫెయిర్, కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమాలను నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ కోడం శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపుగా 450 మంది విద్యార్థిని విద్యార్థులు 196 ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ మరుపల్లి రవి, ప్రత్యేక అతిధిగా వరంగల్ జిల్లా వడుప్సా అధ్యక్షులు శ్యామ్ హాజరై మాట్లాడుతూ…. విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలిక తీయడమే సైన్స్ ఫెయిర్ అని, నిత్యం తరగతి గదిలో మాత్రమే పాఠ్యాంశాలను బోధించడం కాకుండా ప్రయోగాత్మకంగా పరిశీలనలలో భాగంగా విజ్ఞానో ఉత్పత్తికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కోడం సబిత మాట్లాడుతూ రామన్ ఎఫెక్ట్ గుర్తుగా ప్రభుత్వం జాతీయా సైన్స్ డే గా ఫిబ్రవరి 28 ని ప్రకటించిందని, విద్యార్థులు శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకుని మేధో మదనం చేయాలని అన్నారు. వడుప్సా జనరల్ సెక్రెటరీ బిల్లా రవి, ట్రెజరర్ టీ జ్ఞానేశ్వర్ సింగ్ మాట్లాడారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు


