జీవన విధానాన్ని మార్చేసిన సైన్స్
కాకతీయ, నెక్కొండ: ఆధునిక యుగంలో శాస్త్ర విజ్ఞానం మానవ జీవన విధానాన్ని సమూలంగా మార్చేసిందని నెక్కొండ మండలం అప్పలరావుపేట జెడ్పీ హైస్కూల్ హెచ్ ఎం కొండపర్తి రవీందర్ అన్నారు. శనివారం పాఠశాలలో జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నోబెల్ బహుమతి గ్రహీత సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు సైన్స్ టాలెంట్ టెస్ట్, సైన్స్ క్విజ్, సైన్స్ రంగవల్లుల పోటీలు, ప్రయోగ ప్రదర్శనలు నిర్వహించారు. సీనియర్ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు బూరుగుపల్లి శ్రవణ్ కుమార్, బయో సైన్స్ ఉపాధ్యాయురాలు మిట్టపల్లి గీత ఆధ్వర్యంలో నిర్వహించారు. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాకయ్య, భూలక్ష్మి, వెంకట్రాజం దయాకర్, రమేష్, సునీత తదితరులు పాల్గొన్నారు.


