ఇసుక మాఫియాపై ఉక్కుపాదం
సరిహద్దుల్లో విజిబుల్ పోలీసింగ్ పటిష్టం చేయాలి
అక్రమ రవాణాపై కేసులు, వాహనాల జప్తు తప్పనిసరి
అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్ రావు
చెక్‌పోస్టుల వద్ద కఠిన పర్యవేక్షణకు ఆదేశాలు
మధిర రూరల్ స్టేషన్ నిర్వహణపై సమగ్ర సమీక్ష
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టాలని అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్ రావు పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం మధిర రూరల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన జిల్లా సరిహద్దుల్లో విజిబుల్ పోలీసింగ్‌ను మరింత పటిష్టం చేయాలని స్పష్టం చేశారు. చెక్‌పోస్టుల ద్వారా ఇసుక రవాణాపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, అక్రమంగా ఇసుక తరలించినా లేదా నిల్వ ఉంచినా వెంటనే చట్టప్రకారం కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలని ఆదేశించారు. సంబంధిత వాహనాలను జప్తు చేసి కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ నిర్వహణపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. డయల్ 100 కాల్స్ స్పందన, పిటిషన్ ఎంక్వైరీలు, విలేజ్ హిస్టరీ షీట్లు, హిస్టరీ షీట్లు, ఎన్‌బిడబ్ల్యులు, సిసిటిఎన్‌ఎస్ వినియోగం, రిసెప్షన్ నిర్వహణ, యూఐ కేసులు, వివిధ కేసుల్లో స్వాధీనం చేసిన వాహనాల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాల శుభ్రత, ఐదు ఎస్ అమలు, గ్రామ సందర్శనలు, అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల పనితీరు, పెట్రోలింగ్ వ్యవస్థపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇసుక అక్రమ రవాణాపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.


