108 సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
కాకతీయ, ఆత్మకూరు: ప్రజలకు అత్యవసర సేవల్లో 108 సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని 108 అంబులెన్స్ జిల్లా మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆత్మకూరు మండలంలోని 108 అంబులెన్సు సిబ్బంది పానీతిరును,రికార్డులను పరిశీలిస్తూ మాట్లాడారు. వేసవి కాలంలో ప్రజలకు అవసరమయ్యే గ్లూకోజ్, గ్లూకోన్, ఓఅర్ఎస్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రజలు 108కి ఫోన్ చేస్తే రాత్రి పగలు తేడా లేకుండా అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాలని సూచించారు. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు 150 మందిని కాపాడినందుకు 108 సిబ్బంది తక్కల్లా నరేష్, రాజు, ప్రకాష్, అనిల్, రమేష్ ను అభినందించారు.


