epaper
Sunday, March 1, 2026
epaper

వంద ప‌బ్లిక్ స్కూళ్లు

వంద ప‌బ్లిక్ స్కూళ్లు
పైలెట్ ప్రాజెక్టు త‌ర‌హాలో నియోజ‌క‌వ‌ర్గంలో ఒక‌టి
ఆరుట్ల పాఠ‌శాల త‌ర‌హాలో వ‌స‌తులు, ర‌వాణా సౌక‌ర్యం
క్యూర్‌లో ఏడాదిలోపే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు సిద్ధం కావాలి
99 రోజుల ప్రొగ్రాంలో వారం రోజులు పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో కార్య‌క్ర‌మాలు
ఏఐ సాంకేతిక‌పై ఉపాధ్యాయులు, లెక్చ‌ర‌ర్ల‌కు స్వ‌ల్ప‌కాలిక శిక్ష‌ణ‌
ప్రాథ‌మిక పాఠ‌శాల నుంచి నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు బ్రేక్‌ఫాస్ట్
విశ్వ విద్యాల‌యాల‌కు నిధులు అంద‌జేత‌పై నివేదిక స‌మ‌ర్పించండి
విద్యా శాఖపై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ విద్యా విధానం నివేదిక అంద‌జేసిన క‌మిష‌న్ స‌భ్యులు
ఫీజుల నియంత్ర‌ణ‌పై రిటైర్డ్ జ‌డ్జి లేదా రిటైర్ చీఫ్ సెక్ర‌ట‌రీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర క‌మిటీ

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో (హైద‌రాబాద్ న‌గ‌రం వెలుప‌ల‌) తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్ల‌ను ఈ ఏడాది నుంచి ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. త‌ర‌గ‌తి గ‌దులు, క్రీడా మైదానం, ఇత‌ర అన్ని ర‌కాల వ‌స‌తులు, బోధ‌నా సిబ్బంది, ర‌వాణా సౌక‌ర్యం క‌లిగి ఉన్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల తెలంగాణ ప‌బ్లిక్ స్కూల్ త‌ర‌హాలోనే ఈ వంద స్కూళ్లు ఉండాల‌ని సీఎం ఆదేశించారు. విద్యా శాఖ‌పై కమాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గురువారం స‌మీక్ష నిర్వ‌హించారు. నాణ్య‌మైన విద్య‌కు చిరునామాగా తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను తీర్చిదిద్దాల‌ని సీఎం పేర్కొన్నారు. ఇందుకు ఎంత వ్య‌య‌మైనా వెనుకాడేది లేద‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. కోర్ అర్బ‌న్ రీజియ‌న్ ఎకాన‌మీ (క్యూర్‌) ప‌రిధిలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను కార్పొరేట్ పాఠ‌శాల‌ల త‌ర‌హాలో నిర్మించాల‌ని సీఎం ఇంజినీర్ల‌ను ఆదేశించారు. వీటి నిర్మాణంలో ఆధునిక సాంకేతిక‌త‌ను వినియోగించుకోవాల‌ని, ఏడాదిలో క్యూర్ ప‌రిధిలో నిర్దేశించుకున్న 12 ఇంటిగ్రేటెడ్ నూత‌న పాఠ‌శాల‌ల నిర్మాణం పూర్తి కావాల‌ని సీఎం ఆదేశించారు. న‌గ‌రంలోని భార‌తీయ విద్యా భ‌వ‌న్‌, జూబ్లీహిల్స్ ప‌బ్లిక్ స్కూళ్ల‌లో ఉండే అన్ని వ‌స‌తులు ఈ ఇంటిగ్రేటెడ్ పాఠ‌శాల‌ల్లో ఉండాల‌ని సీఎం తెలిపారు. క్యూర్‌లో అప్‌గ్రేడ్ చేయ‌నున్న 17 పాఠ‌శాల‌లు, అద‌న‌పు గ‌దులు, ఇత‌ర వ‌స‌తులు క‌ల్పించ‌నున్న 164 పాఠ‌శాల‌ల ప‌నుల్లో ఎటువంటి రాజీ ప‌డ‌కూడ‌ద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో 99 రోజుల పాటు చేప‌ట్ట‌నున్న కార్య‌క్ర‌మాల్లో వారం రోజులు విద్యా సంబంధిత అంశాల‌కు కేటాయించాల‌ని సీఎం సూచించారు. ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల‌ను సంద‌ర్శించి అవ‌స‌ర‌మైన వ‌స‌తుల క‌ల్ప‌న‌, ఇత‌ర అంశాల‌ను తెలుసుకొని వాటి ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

పాఠ‌శాల స్థాయి నుంచే ఏఐ పాఠాలు

కృత్రిమ మేథ (ఏఐ) ప్ర‌పంచాన్ని శాసిస్తున్న నేప‌థ్యంలో పాఠ‌శాల స్థాయి నుంచి దాని బోధ‌న‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు త‌క్ష‌ణ‌మే చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మారుతున్న సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకునేలా ఏఐపై ఉపాధ్యాయులు, లెక్చ‌ర‌ర్ల‌కు స్వ‌ల్ప‌కాలిక శిక్ష‌ణ త‌ర‌గ‌తులు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. ఏఐతో ప్రపంచ వ్యాప్తంగా వ‌చ్చే మార్పుల‌ను తెలుసుకొని దాని ద్వారా వ‌చ్చే అవ‌కాశాలు మ‌న విద్యార్థులే అందిపుచ్చుకునేలా మ‌న స‌న్న‌ద్ధ‌త ఉండాల‌ని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. సాంకేతిక విద్యా విధానంలో అందుకు అనుగుణ‌మైన మార్పుల‌ను తీసుకురావాల‌ని సీఎం పేర్కొన్నారు.

బ్రేక్ ఫాస్ట్ అమ‌లు చేయాలి..!

2026-2027 విద్యా సంవ‌త్స‌రం నుంచి అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు బ్రేక్ ఫాస్ట్ అమ‌లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. బ్రేక్ ఫాస్ట్ అంద‌జేత‌కు సంబంధించి అధికారులు, హ‌రేకృష్ణ‌మిష‌న్ ప్ర‌తినిధుల‌కు సీఎం ప‌లు సూచ‌న‌లు చేశారు. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ప్ర‌తి విద్యార్థికి పాలు అంద‌జేయాల‌ని.. ఇందుకు పాల‌ను విజ‌యా డెయిరీ నుంచి సేక‌రించాల‌ని సీఎం ఆదేశించారు. విద్యార్థుల‌కు ఎన్ని క్యాల‌రీలు అంద‌జేస్తున్నామ‌నేది తెలుసుకునేందుకు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. పాఠ‌శాల విద్యార్థుల‌కు స్కూల్ యూనిఫాం, పుస్త‌కాల‌తో పాటు ఈ ఏడాది నుంచి కిట్ అంద‌జేయాల‌ని అందులో స్కూల్ బ్యాగ్‌, పెన్నులు, పెన్సిళ్లు, షార్ప‌న‌ర్లు, రంగుల పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, డిక్ష‌న‌రీ, బూట్లు, సాక్సులు ఉండాల‌ని సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని బ‌డ్జెట్‌లో పొందుప‌ర్చేలా చూడాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.

కాలం చెల్లిన కోర్సుల‌ను తొల‌గించండి..!

పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు, ఏటీసీల్లో ఏఐ ఆధారిత కోర్సులు వెంట‌నే ప్రారంభించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాలం చెల్లిన కోర్సుల‌ను తొల‌గించాల‌న్నారు. పాలిటెక్నిక్‌, ఏటీసీల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి వెంట‌నే వివిధ ప‌రిశ్ర‌మ‌ల్లో ఉపాధి అవ‌కాశాలు ల‌భించేలా చూడాల‌ని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాల‌యాల‌కు నిధులు కేటాయిస్తామ‌ని సీఎం తెలిపారు. ఇప్ప‌టికే ఉస్మానియా యూనివ‌ర్సిటీకి రూ.1000 కోట్లు కేటాయించిన విష‌యాన్ని సీఎం గుర్తు చేశారు. మిగ‌తా యూనివ‌ర్సిటీల‌కు ఎంత నిధులు అవ‌స‌ర‌మ‌నే దానిపై నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఉన్న‌త విద్యా మండ‌లి ఛైర్మ‌న్ బాల‌కిష్టారెడ్డిని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

ఫీజుల నియంత్ర‌ణ‌పై నివేదిక కోరిన సీఎం

ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో ఫీజుల నియంత్ర‌ణ‌కు సంబంధించి తెలంగాణ ప్రైవేటు పాఠ‌శాల‌ల ఫీజు రెగ్యుల‌ట‌రీ మానిట‌రింగ్ క‌మిష‌న్ త‌మ నివేదికలోని అంశాల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఎదుట ఉంచింది. వివిధ రాష్ట్రాల్లో అమ‌ల్లో ఉన్న విధానాలు, తెలంగాణ‌లో తీసుకోవాల్సిన అంశాల‌ను వివ‌రించారు. సావ‌ధానంగా విన్న ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి జిల్లా స్థాయిలో క‌లెక్ట‌ర్‌, డీఈవోల నేతృత్వంలో పాఠ‌శాల‌ల‌ను ప‌రిశీలించి ఫీజుల నిర్ణ‌యంపై నివేదిక స‌మ‌ర్పించాల‌న్నారు.. రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ జ‌డ్జి లేదా రిటైర్డ్ చీఫ్ సెక్ర‌ట‌రీ స్థాయిలోని క‌మిటీ తుది క‌మిటీగా ఉండి నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని తెలిపారు. అలాగే ఫీజు నియంత్ర‌ణ‌కు సంబంధించి విద్యార్థుల త‌ల్లిదండ్రులు, మేధావులు, సామాజిక‌వేత్త‌ల అభిప్రాయ సేక‌ర‌ణ‌కు ముసాయిదాను ప‌బ్లిక్ డొమైన్‌లో ఉంచాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

తెలంగాణ విద్యా క‌మిష‌న్ నివేదిక‌..!

తెలంగాణ విద్యా విధానంపై తాము రూపొందించిన నివేదిక‌ను తెలంగాణ విద్యా క‌మిష‌న్ ఛైర్మ‌న్ ఆకునూరి ముర‌ళి, స‌భ్యులు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డికి స‌మ‌ర్పించారు. అమెరికా, వియ‌త్నాం, మ‌లేసియా దేశాల్లో స్వ‌యంగా ప‌ర్య‌టించ‌డంతో పాటు వివిధ దేశాలు, ప‌లు రాష్ట్రాల్లోని అత్యుత్త‌మ విధానాల‌ను ప‌రిశీలించి నివేదిక రూపొందించిన‌ట్లు విద్యా క‌మిష‌న్ ఛైర్మ‌న్‌, స‌భ్యులు సీఎంకు తెలియజేశారు. నివేదిక‌లోని ఒక్కో అంశంపై ఛైర్మ‌న్ ముర‌ళి సుదీర్ఘంగా వివ‌రించారు. సావ‌ధానంగా ఆల‌కించిన ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆయా అంశాల‌పై త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తూ ప‌లు సూచ‌న‌లు చేశారు. అనంత‌రం నివేదిక‌లో చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల్సిన అంశాలు… వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి అమ‌లు చేయ‌ద‌గిన అంశాల‌పై నివేదిక రూపొందించే బాధ్య‌త‌ను ప్ర‌భుత్వ స‌ల‌హాదారు డాక్ట‌ర్ కేశ‌వ‌రావు నేతృత్వంలోని క‌మిటీకి ముఖ్య‌మంత్రి అప్ప‌గించారు. స‌మావేశంలో ముఖ్య‌మంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్ట‌ర్ కేశవరావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణా రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శిగా యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ దేవసేన, ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు డైరెక్ట‌ర్ కృష్ణ ఆదిత్య‌, విద్యా శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి వెంక‌టేష్ ధోత్రే, పాఠ‌శాల విద్యా శాఖ డైరెక్ట‌ర్ న‌వీన్ నికొల‌స్‌, స‌మ‌గ్ర శిక్ష నోడ‌ల్ ఆఫీస‌ర్‌, డి.నాగ‌రాజు, ఉస్మానియా విశ్వ విద్యాల‌యం వీసీ ప్రొఫెస‌ర్ మొలుగారం కుమార్‌, డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, విద్యా క‌మిష‌న్ స‌భ్యులు ప్రొఫెసర్ పీ.ఎల్‌.విశ్వేశ్వ‌ర‌రావు, డాక్ట‌ర్ చార‌కొండ వెంక‌టేష్, జ్యోత్స్న శివారెడ్డి, ప్రొఫెస‌ర్ ప‌ద్మ‌జా షా, కార్తీక్ సుబ్ర‌హ్మ‌ణ్య‌న్‌, వీర వాస‌వి, డాక్ట‌ర్ జెన్న‌త్‌ఫ‌ర్ అజ్మీ స‌య్య‌ద్‌, డాక్ట‌ర్ ఎన్‌.వెంక‌టేష్‌, షేక్ జావేద్ అఫ్రోజ్‌, డాక్ట‌ర్ జే.స్వ‌ప్న‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img