వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 గోడపత్రిక విడుదల
– 2047 దిశగా యువత ఆలోచనలకు వేదిక
– జిల్లాస్థాయి యూత్ పార్లమెంట్‌కు విద్యార్థులకు పిలుపు
– ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఎస్ గణపతిరావు
కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 గోడపత్రికను ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఎస్ గణపతిరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఎస్ గణపతిరావు మాట్లాడుతూ… 2047 నాటికి దేశం ఎలా ఉండాలనే అంశంపై యువత ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. యూత్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య అవగాహన పెంపొందిస్తాయని తెలిపారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కోఆర్డినేటర్ వి మార్కండేయ మాట్లాడుతూ శనివారం సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో జిల్లాస్థాయి యూత్ పార్లమెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డి వెంకటేష్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు పెద్దిరాజు, ఎస్ మహేందర్, వై రామచంద్రం, పరీక్షల నియంత్రణ అధికారి ఎం భవాని, అకాడమిక్ కోఆర్డినేటర్ విజయ భాస్కర్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


