ఏప్రిల్ 7న ‘వారణాసి’
కాకతీయ, సినిమా డెస్క్: సినీ ప్రేమికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ వారణాసి విడుదల తేదీపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ఆ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు రాజమౌళి అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ రిలీజ్ డేట్‌ను ఖరారు చేశారు. దీంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేశ్‌బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా కావడం, రాజమౌళి దర్శకత్వం వహించడం వల్ల ఈ ప్రాజెక్ట్‌కు దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ లాంటి గ్లోబల్ హిట్స్ తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


