అటవీ భూమిని కాపాడాలి
ఫారెస్ట్ అధికారులకు డీఎఫ్‌వో కిష్టగౌడ్ సూచన
కాకతీయ, జూలూరుపాడు : అటవీ భూములను పరిరక్షించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ అధికారి కిష్టగౌడ్ అన్నారు. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ యు కోటేశ్వరరావుతో కలిసి బుధవారం జూలూరుపాడు ఫారెస్ట్ రేంజ్ లో కిష్టగౌడ్ పర్యటించారు. ఈసందర్శనలో రాజారావుపేట బీట్ లో గత సంవత్సరం వేసిన ప్లాంటేషన్‌ను, వినోబానగర్ బీట్లో రెండు సంవత్సరాల క్రితం నాటిన ప్లాంటేషన్‌ను, రాజారావుపేట బీట్‌లోని నేచురల్ ఫారెస్టును కలియ తిరిగి పరిశీలించారు. అనంతరం అధికారులకు ప్లాంటేషన్‌లో ఇంటర్ ఫ్లెమింగ్ టెక్నాలేజీతో కలుపు మొక్కలు త్వరగా తీపించాలని సూచించారు. అటవీ సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహించి అటవీ సంపదనను కాపాడటంలో ఎటువంటి అలసత్వం వహించొద్దని సూచించారు. ఎఫ్ఆర్ఓ ప్రసాద్ రావు, సెక్షన్ ఆఫీసర్ మల్లయ్య, బీట్ ఆఫీసర్ రేఖా, రహీం, కిషన్, వెంకటేశ్వర్లు,శ్రావణ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.


