ప్రతి పేదింటికి వెలుగులు తెచ్చే ప్రజా ప్రభుత్వం మంత్రి పొంగులేటి
మంగాపురం తండా అభివృద్ధికి ₹7.65 కోట్లు
బుద్దారం గ్రామాభివృద్ధికి ₹12.24 కోట్లు
సీసీ రోడ్ల శంకుస్థాపన, సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ*
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: రాష్ట్రంలో ప్రతి పేదింటికి వెలుగులు తెచ్చే దిశగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆయన నేలకొండపల్లి మండలంలో పర్యటించి మంగాపురం తండా, బుద్దారం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.మంగాపురం తండాలో ₹30 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి, గత 20 నెలల్లో ₹57 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించామని తెలిపారు. మంగాపురం–నాచేపల్లి మధ్య ₹4.50 కోట్లతో బీటీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయని, రావిగూడెం–మంగాపురం తండా మధ్య ₹2.22 కోట్లతో బీటీ రోడ్డు పనులు పూర్తయ్యాయని వివరించారు. అదనంగా ₹7 లక్షలతో అంగన్‌వాడీ భవనం నిర్మాణం కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. మొత్తం మంగాపురం తండా అభివృద్ధికి ₹7.65 కోట్ల నిధులు మంజూరు చేశామని వెల్లడించారు.బుద్దారం గ్రామంలో ₹26 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు నిర్మించామని, నేలకొండపల్లి–గండ్రాయి బీటీ రోడ్డు పై ₹7 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పూర్తి చేశామని చెప్పారు. గత 22 నెలల్లో బుద్దారం గ్రామాభివృద్ధికి మొత్తం ₹12.24 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. రెండు లక్షల వరకు పంట రుణమాఫీ పూర్తయిందని, రైతులకు మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు క్వింటాల్‌కు ₹500 బోనస్ అందిస్తున్నామని చెప్పారు. రైతు భరోసా కింద ₹9 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్‌లో సన్నబియ్యం సరఫరా, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు.
గత ప్రభుత్వం పేదల గృహ నిర్మాణ పథకాలను విస్మరించిందని విమర్శించిన మంత్రి, ప్రజా.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ ఎర్రయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.



