epaper
Sunday, March 1, 2026
epaper

టీమిండియాదే సిరీస్

టీమిండియాదే సిరీస్
భార‌త్‌.. ఆస్ట్రేలియా ఆఖరి టీ 20 రద్దు..
ఓపెనర్లు గిల్.. అభిషేక్ శర్మ దూకుడు

కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా సిరీస్ విజయంతో ముగించింది. ఐదు టీ 20ల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానం వేదికగా శనివారం జరిగిన ఆస్ట్రేలియా-భారత్ ఆఖరి టీ20 వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో ఈ సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది. వర్షం కారణంగా ఈ ఐదు టీ20ల సిరీస్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌గా మారిపోయింది. తొలి మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ విజయంతో వరల్డ్ ఛాంపియన్‌గా టీమిండియా తమ సత్తాను చాటింది. మూడు వన్డేల సిరీస్‌ను 1-2తో కోల్పోయిన భారత్.. టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకొని ఈ పర్యటనను ఘనంగా ముగించింది. ఆఖరి టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ మ్యాచ్ ఆగిపోయే సమయానికి 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(16 బంతుల్లో 6 ఫోర్లతో 29 బ్యాటింగ్), అభిషేక్ శర్మ(13 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 23) దూకుడుగా ఆడారు.

భారీ వ‌ర్షంతో ఆట ర‌ద్దు

బెన్ ద్వార్షూయిస్ వేసిన తొలి ఓవర్‌లోనే ఐదు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అభిషేక్ శర్మ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను గ్లేన్ మ్యాక్స్‌వెల్ నేలపాలు చేయగా.. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో ఇచ్చిన మరో ఈజీ క్యాచ్‌ను ద్వార్షూయిస్ చేజార్చాడు. ఈ రెండు అవకాశాలతో అభిషేక్ శర్మ చెలరేగాడు. క్యాచ్‌ వదిలిన మరుసటి బంతికే సింగిల్ తీసి టీ20ల్లో 1000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. టీ20ల్లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. గత మూడు టీ20ల్లో పేలవ ఫామ్‌తో సతమతమైన శుభ్‌మన్ గిల్…ఈ మ్యాచ్‌లో మాత్రం స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. అభిషేక్ తడబడినా వరుస బౌండరీలతో జోరు కనబర్చాడు. ఈ క్రమంలో ప్రతికూల వాతావరణం మ్యాచ్‌కు అడ్డంకిగా మారింది. వర్షం రాకపోయినా.. మైదానాన్ని మబ్బులు కమ్మేయడంతో పాటు భారీ ఉరుములతో కూడిన గాలివాన వస్తుందనే హెచ్చరికల నేపథ్యంలో అంపైర్లు ఆటను నిలిపేసారు. ఆ కాసేపటికే భారీ వర్షం కురవడంతో ఆట సాధ్యం కాలేదు. వర్షం మరింత పెరగడంతో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మహిళా క్రికెట్‌లో మహారాణి..

మహిళా క్రికెట్‌లో మహారాణి.. దిగ్గజాలను దాటేసిన హర్మన్‌ప్రీత్ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళగా రికార్డు కాక‌తీయ‌,...

సూపర్ 8లోకి జింబాబ్వే ..

సూపర్ 8లోకి జింబాబ్వే .. ప్రపంచ విజేతలకే చుక్కలు చూపిస్తున్న ప‌సికూన‌ అంచ‌నాల‌కు అంద‌కుండా...

ప్రపంచకప్​లో నెదర్లాండ్స్​ బోణీ

ప్రపంచకప్​లో నెదర్లాండ్స్​ బోణీ నమీబియాపై 7 వికెట్ల తేడాతో విజయం ఆల్​రౌండ్ ప్రదర్శనతో రాణించిన...

జట్టు ప్రయోజనాలే ముఖ్యం

జట్టు ప్రయోజనాలే ముఖ్యం గంభీర్, సూర్యకుమార్ విజ్ఞప్తిని తిరస్కరించిన బీసీసీఐ మెగా టోర్నీ సందర్భంగా...

రూ. 1560 కోట్ల భారీ లాస్ నుంచి తప్పించుకున్న ఐసీసీ

రూ. 1560 కోట్ల భారీ లాస్ నుంచి తప్పించుకున్న ఐసీసీ పాకిస్థాన్ అనూహ్య...

గౌర‌వం ద‌క్క‌లేదు

గౌర‌వం ద‌క్క‌లేదు జ‌ట్టులో మ‌ద్ద‌తూ ల‌భించ‌లేదు కోరుకున్న స్థానం పొంద‌లేక‌పోయా అందుకే క్రికెట్‌కు గుడ్ బై...

విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్

విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్ ఏ ప్ల‌స్‌ గ్రేడ్​ రద్దు బీ కేటగిరీలోకి...

గంభీర్ శిక్ష‌ణ‌కు ప‌రీక్ష‌

గంభీర్ శిక్ష‌ణ‌కు ప‌రీక్ష‌ టీమ్ఇండియాకు 5 చేదు జ్ఞాపకాలు ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్న చెత్త రికార్డులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img