శివాజీ ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలి
* కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచ్ కొమ్ము రవి
కాకతీయ, చేర్యాల: చత్రపతి శివాజీ ఆశయ సాధన కోసం ప్రతి యువత కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకునూరు గ్రామ సర్పంచి కొమ్మురవి తెలిపారు.మండలంలోని అకునూర్ గ్రామంలోని అంగడి బజార్ చౌరస్తాలోని చత్రపతి శివాజీ జయంతి వేడుకలను గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి పాలభిషేకం చేపట్టి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా కొమ్మురవి మాట్లాడుతూ. దేశంలోనే హిందుత్వానికి గుర్తింపు తెచ్చి సంస్కృతి నిర్మాణం లో ఛత్రపతి శివాజీ కీలక పాత్ర పోషించారని అన్నారు. తల్లి జిజియాబాయి నేర్పిన చరిత్ర పాఠాలతో ధైర్యం, ప్రేమ, ఆత్మీయత లాంటి సద్గుణాలు అలవడ్డాయని గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాయని వివరించారు.

హిందూ సామ్రాజ్య స్థాపన కోసం కృషిచేసిన, పోరాడిన యోధుడు శివాజీ ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువత శివాజీ అడుగుజాడల్లో నలవాలని సూచించారు. ప్రజల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన శివాజీ ధైర్యం, తెలివితేటలు, వ్యూహాత్మక నైపుణ్యం కలిగిన నాయకుడని తెలిపారు. మహిళల పట్ల గౌరవం చూపిన మహానుభావుడిగా ఆయనను ప్రజలు ఎప్పటికీ స్మరించుకుంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా కార్యదర్శి బోయిని రాజు,ఉప సర్పంచ్ కడారి పల్లవి -భాస్కర్,వార్డు సభ్యులు, నూనె శేఖర్, సూర అనిత -సంపత్, జూపల్లి కార్తీక్ రెడ్డి , మహమ్మద్ హైమత్, భూమని భాస్కర్, తాటికొండ శేఖర్, తో పాటు ఆటో యూనియన్ సంఘ సభ్యులు, తదితరులు ఉన్నారు



