- యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చెరుకుపల్లి నరేందర్
కాకతీయ, బయ్యారం : దీర్ఘకాలిక లక్ష్యాలతో యువత రాజకీయాల్లోకి రావాలని ఇల్లందు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చెరుకుపల్లి నరేందర్ అన్నారు. విద్యావంతులు సైతం రాజకీయాల్లో వస్తున్నారని, ఇది స్వాగతించాల్సిన విషయమని అన్నారు. ఎన్నికలప్పుడే కష్టపడితే రాజకీయాల్లో రాణించలేమని తెలిపారు. ప్రజాప్రతినిధులకు హాలీడేస్ ఉండవని, నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటేనే ప్రజలు ఆదరిస్తారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపులో యువత పాత్ర మరువలేనిదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చెయ్యడానికి యువత ముందుకు వచ్చి పోటీ చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు.


