epaper
Monday, March 2, 2026
epaper

సాంకేతికతకు అనుగుణంగా యువత సిద్ధం కావాలి

  • రాబోయే టెక్నాలజీకి తగినట్లుగా విద్యార్థులను సిద్దం చేసేలా ఏటీసీలు
  • రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
  • ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 4 ఏటీసీల ఏర్పాటు
  • ఖమ్మం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి తుమ్మల

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : రాబోయే టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను సిద్దం చేసేలా ఏ.టి.సి.ని ఏర్పాటు చేశామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మంత్రి సోమవారం ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ఐటిఐ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కాలంటే రొటీన్ గా ఉన్న ఐటిఐ కోర్సులు కాకుండా ప్రస్తుత పరిశ్రమల అవసరాల ప్రకారం నైపుణ్య కోర్సులను డిజైన్ చేయించి ఆధునిక సాంకేతిక కేంద్రాల ద్వారా అందిస్తున్నారని అన్నారు. రాబోయే ఐదు నుంచి పదేళ్ల వరకు ప్రపంచీకరణలో జరిగే మార్పులకు అనుగుణంగా ఏటీసీ కోర్సులు డిజైన్ చేశారని అన్నారు.

మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా మన యువతను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక సాంకేతిక కేంద్రంలో అందించే కోర్సులను పూర్తి చేసే ముందే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించేలా టాటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అన్నారు. నిర్వీర్యమైన ఐటీఐలను యువతకు ఉపయోగపడే విధంగా ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం తీర్చిదిద్దిందని అన్నారు. రేవంత్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కు ప్రాధాన్యత కల్పించారన్నారు. నిరుద్యోగ యువతకు మంచి నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఖమ్మం, మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాలలో నాలుగు ఏ.టి.సి.లను ఏర్పాటు చేశారని తెలిపారు. ఇంజనీరింగ్ కోర్సుల కన్నా మెరుగైన నైపుణ్య కోర్సులు ఏటీసీలో అందుబాటులో ఉన్నాయని, వీటిని విద్యార్థులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్తు పరిశ్రమల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఏ.టి.సి. కోర్సులను ప్రభుత్వం డిజైన్ చేసిందని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఫాక్స్ కాన్ ఇయిర్ పాడ్స్ ఉత్పత్తి పరిశ్రమ ఉందని, మన ఏ.టీ.సి. లో రోబోటిక్స్ పూర్తిచేసే విద్యార్థులకు అటువంటి పరిశ్రమలో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. సీపీ సునీల్ దత్ మాట్లాడుతూ దేశంలో స్కిల్ గ్యాప్ బాగా ఉందని, విద్యార్థులు చేసే కోర్సులకు, బయట పరిశ్రమల అవసరాలకు చాలా తేడాలు ఉన్నాయని గమనించిన ప్రభుత్వం ప్రైవేటు సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఏటీసీ సెంటర్ లను ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మన రాష్ట్రంలో పెరుగుతుందని, ఈ రంగం వైపు యువత దృష్టి సారించాలని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఏటిసి ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాస చారి, ఆర్ అండ్ డీ ఎస్ఈ యాకోబు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, కార్మిక శాఖ సహాయ కమిషనర్ కృష్ణవేణి, కార్పొరేటర్ సత్యనారాయణ, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సైదులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img