అదుపు తప్పి యువకుడికి తీవ్ర గాయాలు
కాకతీయ,చేర్యాల :ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఓ వృద్ధుడు అడ్డురాగా అడ్డు తప్పించబోయి యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన చేర్యాల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మద్దూర్ మండలంలోని సలాక్ పూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ తాహెర్ (26) జీవనోపాధిక కోసం గత 15సంవత్సరాలనుండి చేర్యాల పట్టణంలో నివాసం ఉంటూ ఆటో నడుపుకుంటూ కుటుంబ జీవనం సాగిస్తున్నాడు.ఈ తరుణంలో మంగళవారం సాయంత్రం చేర్యాల కొత్త బస్టాండ్ నుంచి అంగడి బజారు కు జాతీయ రహదారి మీదుగా వెళ్తుండగా అటుగా రహదారి మీదుగా ఎదురుగ వస్తున్నా చేర్యాల పట్టణానికి పాక కనకయ్య ను తప్పించబోయి ప్రక్కన ఉన్న డివైడర్ ను ద్విచక్ర వాహనం ఢీకొనగా క్రింద పడ్డ తాహెర్ కు కాలుకు తీవ్ర గాయం కాగా తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అంబులెన్స్ సహాయంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం బలమైన గాయలు కావడంతో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాక కనకయ్య తృటీలో లో కింద పడిపోగా చేర్యాల ఏరియా హాస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.


