కాకతీయ, పినపాక: కుక్క కాటు వేసినా వెంటనే ఇంజక్షన్ వేయించుకోకుండా నిర్లక్ష్యం చేసి రాబీస్ వ్యాధి సోకి యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పినపాక మండలం ఈ బయ్యారం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే ఈ బయ్యారం గ్రామపంచాయతీ బుడ్డోడుగూడెం గ్రామానికి చెందిన ముట్టేబోయిన సందీప్ (25)మంగళవారం రాబిస్ తో మరణించాడు.
రెండు నెలల క్రితం ఇంట్లో పెంచుకునే కుక్క గోరుతో గీకడంతో ఏమి కాదులే అని నిర్లక్ష్యం వహించాడు. ముట్టేబోయిన పున్నయ్య కు ఉన్న ఒకగానొక ఒక కుమారుడు ఇలా మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. రెండు నెలల క్రితం సందీప్ ను కుక్క పిల్ల గోరుతో గీకగా ఆ కుక్కను క్రాస్ రోడ్ లో వదిలి వేశారని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆ కుక్కపిల్ల క్రాస్ రోడ్ లో మరొకరిని సైతం కరిసినట్లు సమాచారం.


