ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణం
చెన్నారావుపేటలో ధర్మతండాలో ఘటన
కాకతీయ, నర్సంపేట : ప్రేమించిన అమ్మాయికి పెండ్లి సంబంధాలు చూస్తున్నారని, ప్రేమించిన యువతితో పెండ్లి జరగదని మనస్తాపం చెందిన మహేష్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ధర్మతండాలో శనివారం రాత్రి జరగగా ఆదివారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధర్మతండాకు చెందిన మహేష్ ఓ అమ్మాయిని ప్రేమించగా.. అమ్మాయి కుటుంబ సభ్యులు ఇందుకు అంగీకరించలేదు. ఈక్రమంలోనే అమ్మాయికి సంబంధాలు చూస్తుండటంతో ఆందోళన చెందిన మహేష్ ఆత్మహత్యకు పాల్పడాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. పురుగుల మందు తాగి బలవన్మరణం చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పురుగుల మందు తాగిన యువకుడి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.


